For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తాత్కాలిక కెప్టెన్ వచ్చాడు, మాట్లాడటం తప్ప ఇంకేం చేయడు?: నోటికి పనిచెప్పిన పంత్

India vs Australia 3rd Test Day 4 : Rishabh Pant return Sledge For Paine,After His Sledge
‘Only thing he can do is talk’: Watch Rishabh Pant give it back to ‘temporary captain’ Tim Paine

హైదరాబాద్: మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఆసీస్ కెప్టెన్ టిమ్‌ పైన్ కవ్వింపులకి భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ శనివారం ఘాటుగానే సమాధానమిచ్చాడు. ఆటలో భాగంగా శుక్రవారం రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తుండగా.. వికెట్ల వెనుక నుంచి టిమ్‌పైన్ వరుసగా కవ్వింపులకి దిగుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే.

ధోనీ పేరుని ప్రస్తావిస్తూ రిషబ్ పంత్‌ని కవ్వించిన టిమ్ పైన్

శుక్రవారం ధోనీ పేరుని ప్రస్తావిస్తూ రిషబ్ పంత్‌ని కవ్వించాడు. "ధోనీ మళ్లీ వికెట్ కీపర్‌గా భారత వన్డే, టీ20 జట్టులోకి వచ్చేశాడు. కాబట్టి, నిన్ను బిగ్‌బాష్ టోర్నీలోని హాబర్ట్ హారికేన్స్ టీమ్‌‌లోకి తీసుకుంటా. ఈ డీల్‌ ఓకే అయితే బాగుంటుంది కదా? నువ్వు కూడా ఆస్ట్రేలియా హాలిడేస్‌ని మరింతగా ఎంజాయ్‌ చేసే అవకాశం దొరుకుతుంది. ఓ మంచి అపార్ట్‌మెంట్ తీసుకుందాం. ఒకవేళ నువ్వు అమ్మాయితో గడపాలనుకుంటే.. నేను నా భార్యని తీసుకుని సినిమాకి వెళ్తా. నువ్వు రాత్రంతా అమ్మాయితో ఎంజాయ్ చేయొచ్చు" పంత్ ఏకాగ్రతని దెబ్బతీసే ప్రయత్నం చేశాడు.

సెంచరీ కొడితే ముంబైని కొనుగోలు చేయమని చెప్తా: పైన్‌కి రోహిత్ ప్రతి సవాల్!

పైన్ బ్యాటింగ్‌కి రాగానే తన నోటికి పనిచెప్పిన పంత్

అయితే శుక్రవారం టిమ్ పైన్ మాటలకు ఎలాంటి బదులివ్వని రిషబ్ పంత్... శనివారం టిమ్‌పైన్ బ్యాటింగ్‌కి రాగానే తన నోటికి పనిచెప్పాడు. సరైన అవకాశం కోసం ఎదురు చూసిన పంత్ సరైన రీతిలో బదులిచ్చాడు. "మయాంక్ అగర్వాల్.. ఈరోజు మన ప్రత్యేక అతిథి వచ్చేశాడు. నువ్వు ఎప్పుడైనా తాత్కాలిక కెప్టెన్ పదం విన్నావా? అతడ్ని ఔట్ చేయాలంటే నువ్వు ఏం చేయాల్సిన పనిలేదు. అతను మాట్లాడటాన్ని ఎక్కువ ఇష్టపడతాడు. ఇంకా చెప్పాలంటే.. అతను మాట్లాడటం మాత్రమే చేయగలడు" అని టిమ్‌పైన్‌ని ఉద్దేశిస్తూ షార్ట్‌లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మయాంక్ అగర్వాల్‌‌కి చెప్తున్నట్లు రిషబ్ పంత్ కవ్వించాడు. ఈ వ్యాఖ్యలు స్టంప్స్‌ మైక్స్‌లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

రోహిత్ శర్మపై కూడా కవ్వింపులకి దిగిన టిమ్‌పైన్

రోహిత్ శర్మపై కూడా కవ్వింపులకి దిగిన టిమ్‌పైన్

కాగా, ఇదే టెస్టులో రెండో రోజైన గురువారం రోహిత్ శర్మపై కూడా కవ్వింపులకి దిగిన టిమ్‌పైన్.. అతను సిక్స్ కొడితే ముంబయి ఇండియన్స్‌ అభిమానిగా మారిపోతానని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా జట్టుకి 399 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. ఆటలో భాగంగా నాలుగో రోజైన శనివారం 54/5తో రెండో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన టీమిండియా 106/8 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.

ఓటమి దిశగా ఆస్ట్రేలియా

ఓటమి దిశగా ఆస్ట్రేలియా

దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 292 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని మొత్తం 399 పరుగుల లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు ముందు ఉంచింది. కాగా, బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా ఓటమి దిశగా సాగుతోంది. ప్రస్తుతం 61.3 ఓవర్లకు గాను 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది.

1
43625
Story first published: Saturday, December 29, 2018, 11:40 [IST]
Other articles published on Dec 29, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+