సెంచరీ కొడితే ముంబైని కొనుగోలు చేయమని చెప్తా: పైన్‌కి రోహిత్ ప్రతి సవాల్!

హైదరాబాద్: మెల్‌బోర్న్ వేదికగా బుధవారం ప్రారంభమైన బాక్సింగ్ డే టెస్టులో ఆటలో భాగంగా రెండోరోజైన గురువారం ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. అయితే, టిమ్ పైన్ వ్యాఖ్యలకు రోహిత్ శర్మ శుక్రవారం ప్రతి సవాల్ విసిరాడు.
రెండో రోజు ఆటలో భాగంగా టిమ్ పైన్ తన మాటలతో రోహిత్ శర్మ దృష్టిని మళ్లించే ప్రయత్నం చేశాడు. చాలా ఓపికగా ఆడుతూ పరుగులు సాధిస్తున్న రోహిత్ శర్మ ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ వికెట్ల వెనకాల నుంచి తెగ ప్రయత్నించాడు. లియాన్ బౌలింగ్‌లో రోహిత్‌ను టీజ్ చేసిన సంగతి తెలిసిందే.

రోహిత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో
రోహిత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కీపర్‌గా ఉన్న పైన్.. షార్ట్‌మిడ్‌లెగ్‌లో ఉన్న ఆసీస్ ప్లేయర్ ఆరోన్ ఫించ్‌తో మాట్లాడుతున్నట్లు నటించి "ఇప్పుడు రోహిత్ శర్మ సిక్స్ కొడితే నేను ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కి మారిపోతా" అని టిమ్ పైన్ కవ్వించడం స్టంప్ మైక్‌లో రికార్డు అయింది.

సహనంతో క్రీజులో నిలిచిన రోహిత్ శర్మ
పైన్ తన మాటలతో ఎంత రెచ్చగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ, రోహిత్ శర్మ మాత్రం ఎటువంటి సహనాన్ని కోల్పోలేదు. అంతేకాదు తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ (63 నాటౌట్: 114 బంతుల్లో 5 ఫోర్లు) సహనంగా ఆడి.. విదేశీ గడ్డపై మూడేళ్ల తర్వాత మళ్లీ టెస్టుల్లో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.
పైన్ వ్యాఖ్యలపై రోహిత్ శర్మ ఇలా
తాజాగా టిమ్ పైన్ వ్యాఖ్యలపై శుక్రవారం ఆట ప్రారంభానికి ముందు రోహిత్ శర్మ స్పందించాడు. "నేను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో టిమ్‌పైన్ మాటలు నా చెవిన పడ్డాయి. కానీ.. వాటిని పట్టించుకోకుండా నా బ్యాటింగ్‌ని కొనసాగించాను. అయితే.. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న అజింక్య రహానేతో మాత్రం ఆ మాటల్ని పంచుకుంటూ.. ఒకవేళ టిమ్‌పైన్ ఈ మెల్‌బోర్న్ టెస్టులో సెంచరీ కొడితే అప్పుడు అతడ్ని కొనుగోలు చేయమని ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీకి చెప్తాను అని జోక్‌గా చెప్పా" అని అన్నాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 22 పరుగులు చేసిన టిమ్ పైన్
ఇదిలా ఉంటే, బాక్సింగ్ డే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 151 పరుగులకే చాపచుట్టేసింది. ఇక, ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ 85 బంతులను ఎదుర్కొని కేవలం 22 పరుగులు మాత్రమే చేశాడు. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో అతను వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక, రెండో ఇన్నింగ్స్‌లోనైనా రోహిత్ శర్మ సవాల్‌ని స్వీకరిస్తాడో లేదో తెలియాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications