For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అన్న బౌలింగ్‌లో సిక్స్ బాదిన ఇర్ఫాన్ పఠాన్.. యువీ సేనపై సచిన్ టీమ్ గెలుపు!

One World One Family Cup‌లో భాగంగా జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో అపురూపమైన ఘటన చోటు చేసుకుంది. అన్న వేసిన ఆఖరి ఓవర్‌లో సిక్స్ బాదిన తమ్ముడు తమ జట్టును గెలిపించాడు. వెంటనే తనను క్షమించాలంటూ అన్నను హత్తుకున్నాడు. ఈ ఆసక్తికర ఘటన‌కు సంబంధించిన ఫొటోలు వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇక దిగ్గజ క్రికెటర్లంతా రెండుగా విడిపోయి వన్ వరల్డ్, వన్ ఫ్యామిలీ టీమ్ పేరిట గురువారం ఓ టీ20 మ్యాచ్ ఆడారు. బెంగళూరులోని సాయి క్రిష్ణన్ క్రికెట్ అకాడమీలో ఈ మ్యాచ్ జరగ్గా.. వన్ ఫ్యామిలీ జట్టుకు దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సారథ్యం వహించగా.. వన్ వరల్డ్ టీమ్‌కు సచిన్ టెండూల్కర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.

 One World One Family Cup: Sachin Tendulkar’s One World Beat Yuvraj Singhs One Family

ఇక పఠాన్ బ్రదర్స్ చెరో జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. సచిన్ సారథ్యం వహించిన వన్ వరల్డ్ టీమ్‌లో ఇర్ఫాన్ పఠాన్ ఆడగా.. యూవీకి చెందిన వన్ ఫ్యామిలీ జట్టు తరఫున యూసఫ్ పఠాన్ బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన యువ రాజ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 180 పరుగులు చేసింది.

యువీ టీమ్ తరఫున డారెన్ మడ్డీ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. అనంతరం అల్విరో పీటర్సన్(50 బంతుల్లో 74) సూపర్ బ్యాటింగ్‌తో సచిన్ టీమ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. చివరి ఓవర్‌లో సచిన్ టీమ్‌ విజయానికి ఏడు పరుగులు అవసరమవ్వగా.. యూసఫ్ పఠాన్ కట్టడిగా బౌలింగ్ చేయడంతో తొలి 4 బంతుల్లో 4 పరుగులే వచ్చాయి.

చివరి 2 బంతుల్లో 3 పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో ఇర్ఫాన్ పఠాన్ ఐదో బంతిని సిక్సర్ బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. సిక్సర్ బాదిన వెంటనే అన్నను గట్టిగా హత్తుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో సచిన్ 16 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 27 పరుగులు చేశాడు. శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీదరణ్ బౌలింగ్‌లోనే సచిన్ ఔటయ్యాడు. వన్ ఫ్యామిలీ తరఫున చమింద వాస్(3/46) మూడు వికెట్లు తీయగా.. యువీ, జాసన్ క్రేజా, మురళీదరన్ తలో వికెట్ తీసారు.

అంతకు ముందు యువరాజ్ సింగ్ 10 బంతుల్లో 23 పరుగులు చేయగా.. యుసఫ్ పఠాన్(24 బంతుల్లో 38) పరుగులతో రాణించాడు. వన్ వరల్డ్ తరఫున హర్భజన్ సింగ్(2/30) రెండు వికెట్లు తీయగా.. మాంటీ పనేసర్, అశోక్ దిండా, సచిన్ టెండూల్కర్ తలో వికెట్ తీసారు. 'ఒకే ప్రపంచం.. ఒకే కుటుంబం'అనే నినాదాన్ని వ్యాప్తి చేసేందుకు ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహించారు.

Story first published: Thursday, January 18, 2024, 16:29 [IST]
Other articles published on Jan 18, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+