Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ చరిత్రలోనే 'వన్ సీజన్ వండర్స్' ఎవరంటే?

ఐపీఎల్ చరిత్రలో కొందరు ఆటగాళ్లు వన్ సీజన్ వండర్స్‌లా మిగిలిపోయారు. ఒక్క సీజన్ అద్భుత ప్రదర్శన చేసి, తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నా.. ఆ తర్వాత ఫామ్ కోల్పోయి అదృశ్యమయ్యారు. అలాంటి ఆటగాళ్లపై ఓ లుక్కెద్దాం.

స్వప్నిల్ అస్నోద్కర్..

ఐపీఎల్ 2008 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ స్వప్నిల్ అస్నోద్కర్ అసాధారణ బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. దూకుడైన బ్యాటింగ్‌తో 9 మ్యాచ్‌ల్లో 311 పరుగులతో టాక్ ఆఫ్ ది నేషన్‌గా నిలిచాడు. సౌతాఫ్రికా ప్లేయర్ గ్రేమ్ స్మిత్‌తో కలిసి అదిరిపోయే ఆరంభాలు అందించి రాజస్థాన్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ, ఆ తర్వాత మూడు సీజన్లలో దారుణంగా విఫలమై కనుమరుగయ్యాడు.

పాల్ వాల్తాటీ..

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్లేయర్ పాల్ వాల్తాటీ కూడా ఒక్క సీజన్‌లోనే మెరిసాడు. 2011లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 63 బంతుల్లో 123 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో యశస్వి జైస్వాల్ ఆ రికార్డ్ బద్దలు కొట్టేవరకు ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసి అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా వాల్తాటీ కొనసాగాడు.

ఈ సెంచరీ తర్వాత.. డెక్కన్ ఛార్జర్స్‌పై 75 పరుగులతో పాటు నాలుగు వికెట్లు తీసి ఆల్‌రౌండర్‌గా సత్తా చాటాడు.

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ప్రదర్శనతో పంజాబ్ జట్టులోకి వచ్చిన వాల్తాటీ.. ఐపీఎల్ 2011 సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 463 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2012 సీజన్‌లో మణికట్టు గాయంతో ఫామ్ కోల్పోయిన వాల్తాటీ ఆ తర్వాత కనురుగయ్యాడు.

One-Season Wonders IPL Stars Who Ruled the League for a Year and Vanished

మన్విందర్ బిస్లా..

కేకేఆర్ ప్లేయర్ మన్విందర్ బిస్లా కూడా ఐపీఎల్ 2012 సీజన్‌లో దుమ్మురేపి ఆ తర్వాత పత్తా లేకుండా పోయాడు. ఐపీఎల్ 2012 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి కేకేఆర్ టైటిల్ గెలవడంతో మన్విందర్ కీలక పాత్ర పోషించాడు.

ఆ సీజన్‌లో ఏడు మ్యాచ్‌ల్లో 213 పరుగులు చేసిన మన్విందర్ బిస్లా.. ఫైనల్లో 48 బంతుల్లో 89 పరుగులు చేసి కేకేఆర్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. ఐపీఎల్ ఫైనల్లో అత్యధిక పరుగులు చేసిన అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా రికార్డు సాధించాడు. ఇప్పటి ఈ రికార్డ్ చెక్కుచెదరకుండా ఉంది. కానీ ఆ తర్వాత అతను ఆ జోరు కొనసాగించలేక ఆటకు దూరమయ్యాడు.

ప్రవీణ్ తాంబే..

ఐపీఎల్ 2013 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 41 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసిన ప్రవీణ్ తాంబే.. అతిపెద్ద వయస్కుడైన ఆటగాడిగా రికార్డ్ సాధించాడు. ఎలాంటి ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన అనుభవం లేని అతన్ని రాహుల్ ద్రవిడ్ గుర్తించి అవకాశం కల్పించాడు.

డీవై పాటిల్ మైదానంలో సంధాన అధికారిగా పనిచేసిన తాంబే.. అక్కడి మ్యాచ్‌ల్లో బ్యాటర్లను ఇబ్బంది పెట్టి రాజస్థాన్ స్కౌట్స్‌ను ఆకట్టుకున్నాడు. 2013 మే 7న ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత, 2014 మే 5న, 42 ఏళ్ల వయస్సులో, తాంబే మోతెరా మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై హ్యాట్రిక్ తీసి తన జట్టుకు 10 పరుగుల విజయాన్ని అందించాడు. ఆ సీజన్‌లో 13 మ్యాచ్‌లలో మొత్తం 15 వికెట్లు పడగొట్టాడు.

గుజరాత్ లయన్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వంటి పలు జట్ల తరఫున ఆడిన తాంబే, తన ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 33 మ్యాచ్‌లలో 30.5 సగటుతో 28 వికెట్లు తీశాడు. 2019 వేలంలో ₹20 లక్షలకు కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసినప్పుడు, 48 ఏళ్ల వయస్సులో వేలంలోకి వచ్చిన అతి పెద్ద ఆటగాడు ఇతనే. అయితే, దుబాయ్‌లో జరిగిన టీ10 లీగ్‌లో ఆడినందుకు 2020 ఐపీఎల్ నుంచి బీసీసీఐ అనర్హుడిగా ప్రకటించింది. ఆ తర్వాత భారత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడాడు. ప్రవీణ్ తాంబే జీవిత కథ ఆధారంగా సినిమా కూడా వచ్చింది.

రాహుల్ తెవాటియా..

ఐపీఎల్ 2020 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున రాహుల్ తెవాటియా మెరుపు బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో వరుసగా ఐదు సిక్సర్లు కొట్టి సంచలన విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో ఒక దశలో 19 బంతుల్లో 8 పరుగులే చేసిన తెవాటియా.. షెల్డన్ కాట్రెల్ వేసిన ఆఖరి ఓవర్‌లో వరుసగా ఐదు సిక్స్‌లు బాది టాక్ ఆఫ్ ది నేషన్‌గా నిలిచాడు. ఆ సీజన్‌లో రాహుల్ తెవాటియా..255 పరుగులతో పాటు 10 వికెట్లు పడగొట్టాడు.

ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ జట్టు అతన్ని రూ.9 కోట్లకు కొనుగోలు చేయడంతో అతని విలువ మరింత పెరిగింది. ఆ సీజన్‌లోనూ రాహుల్ తెవాటియా సత్తా చాటాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు బాది సంచలన విజయాన్ని అందించాడు. కానీ గత మూడు సీజన్లుగా అతని ప్రదర్శన మరీ దారుణంగా పడిపోయింది.

Story first published: Monday, May 18, 2026, 17:52 [IST]
Other articles published on May 18, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+