న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇది నా కెరీర్‌లోనే అత్యుత్తమ విజయం: కేన్ విలియమ్సన్

One of our best wins – Kane Williamson

అబుదాబి: అంచనాలకు అందకుండా ఆశ్చర్యపరిచే ఆటతో మరోసారి తన మార్కు ప్రదర్శన చూపించింది పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు. సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో అనూహ్య ఓటమి ముంగిట తలొంచింది. న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌ తొలి మ్యాచ్‌లో 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌.. 171 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించినా.. రెండో ఇన్నింగ్స్‌లో పేలవంగా ఔటై ఓటమికి గురైంది.

కివీస్‌ కేవలం 4 పరుగుల తేడాతో

కివీస్‌ కేవలం 4 పరుగుల తేడాతో

పాక్-న్యూజిలాండ్ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ నాటకీయ శైలిలో జరిగిన ముగింపు టెస్టు క్రికెట్‌కు చక్కని ప్రచారమని న్యూజిలాండ్‌ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ అన్నాడు. ‘ఏదేమైనా గెలవాల్సిందే'అనే తన జట్టు వైఖరిని ప్రశంసించాడు. పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో కివీస్‌ కేవలం 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. కేవలం 4పరుగుల గెలుపు అంతరంతో న్యూజిలాండ్‌ గెలిచింది. టెస్టు క్రికెట్లో ఇది ఐదో అతి తక్కువ గెలుపు అంతరం.

వార్మర్.. స్మిత్‌లపై నిషేదం కొనసాగించాలి: క్రికెట్ ఆస్ట్రేలియా

మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా అజాజ్

మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా అజాజ్

తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌ 153 పరుగులు చేయగా పాక్‌ 227తో నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో విలియమ్సన్‌ సేన 249 పరుగులు చేసింది. పాక్‌కు 175 పరుగులు లక్ష్యం నిర్దేశించింది. ఛేదనలో పాక్‌ 130/4తో పటిష్ఠ స్థితిలో ఉంది. అయితే కివీస్‌ అరంగేట్రం స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ 5/59తో పాక్‌ నడ్డి విరిచాడు. అత్యంత ఉత్కంఠకరంగా సాగిన ఛేదనలో అజాజే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా నిలిచాడు. అజాజ్‌ ముంబైకి చెందినవాడు కావడం విశేషం. అతడికి తోడుగా ఇష్‌ సోధి 2/37, నీల్‌ వాగ్నర్‌ 2/27తో రాణించారు.

నా కెరీర్‌లో అత్యుత్తమ విజయం

నా కెరీర్‌లో అత్యుత్తమ విజయం

విజయం సాధించిన తర్వాత కివీస్‌ కెప్టెన్ విలియమ్సన్‌ మీడియాతో మాట్లాడాడు. ‘ఇది నిజంగా నాటకీయమే. రెండు జట్లూ 4 రోజులు అత్యంత ఒత్తిడి ఎదుర్కొన్నాయి. చివరికి టెస్టు క్రికెట్‌కు మంచి ప్రచారం లభించింది. పిచ్‌ రెండు జట్లకు సవాల్‌గా నిలిచింది. పాకిస్థాన్‌ కాస్త పైచేయి సాధించింది. మొక్కవోని పట్టుదలతో ఆడటం కలిసొచ్చింది. ఇది నా కెరీర్‌లో అత్యుత్తమ విజయం అనడంలో సందేహం లేదు' అని విలియమ్సన్‌ పేర్కొన్నాడు.

Story first published: Tuesday, November 20, 2018, 10:58 [IST]
Other articles published on Nov 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X