వార్నర్.. స్మిత్‌లపై నిషేదం కొనసాగించాలి: క్రికెట్ ఆస్ట్రేలియా

హైదరాబాద్: ఏడాది నిషేధం విధించిన స్టార్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌ను వీలైనంత త్వరగా జట్టులోకి తిరిగి తీసుకోవాలని చేసిన ప్రయత్నాలు వృథాగా మిగిలిపోయాయి. వారిపై ఉన్న నిషేధ కాలాన్ని తగ్గిస్తే ఎలా ఉంటుందని సమాలోచన చేసిన క్రికెట్ వర్గాలు తుది నిర్ణయానికి వచ్చేసింది. సీఏ పట్టుదలకు ఆ త్రయాన్ని నిషేదాన్ని తప్పించాలని ప్రయత్నించిన వారి ప్రయత్నాలన్నీ పటాపంచలు అయ్యాయి. ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్ నివేదిక అందుకున్న ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అన్ని అంశాలను పరిశీలించింది.

1. క్రికెట్ ఆస్ట్రేలియా ఏం చెప్పిందంటే:
ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్ నివేదిక అందుకున్న ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అన్ని అంశాలను పరిశీలించింది. ఆ తర్వాత వారు తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పులు చేయకూడదని సూచించింది. ఆ ముగ్గురు పూర్తి నిషేదాన్ని అనుభవించాల్సిందేనని తెలిపింది.

2. నిషేదించడానికి కారణం:
దక్షిణాఫ్రికా పర్యటనలో స్మిత్, వార్నర్, బ్యాన్‌క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారు. కొత్త కుర్రాడు కాబట్టి బ్యాన్‌క్రాఫ్ట్‌కు తక్కువ కాలం, సీనియర్ ఆటగాళ్లకు ఏడాదికాలం నిషేధం విధించారు. క్రికెట్ ఆస్ట్రేలియా నియమావళి ఆర్టికల్ నెంబర్ 2.3.5 ప్రకారం..
(అ) క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నా
(ఆ) అధికారికంగా జరిగే విషయమైనా
(ఇ) క్రికెట్ సంప్రదాయానికి హాని కలిగించే విషయమేనా
(ఈ) క్రికెట్‌ను అవమానించేలా ఉన్నా.
పై విషయాల్లో ఏవి జరిగినా నిషేదానికి కారణమవుతారని భావం.
ఆసీస్-భారత్ తొలి టీ20కి 70 వేలా!!

3. నిషేదం.. ఎందుకు చర్చించారంటే:
మాజీ ఆటగాళ్ల నుంచి విమర్శలు పెరిగాయి. బాల్ ట్యాంపరింగ్‌కు వేసిన ఈ శిక్ష ఘోరమని ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై నిషేధ కాలం తగ్గించాలని పదేపదే కోరారు. ఈ నేపథ్యంలోనే జట్టు ప్రదర్శన పేలవంగా మారింది. దాంతో ఆస్ట్రేలియా క్రికెట్ విజయాలను అందుకోవాలనే ఉద్ధేశ్యంతోనే ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్ వారి నిషేదం ఎత్తేయాలంటూ నివేదికను క్రికెట్ ఆస్ట్రేలియాకు పంపింది.

4. నిషేదం కొనసాగించాలని
కొందరు ఆటగాళ్లు మాత్రం స్మిత్, వార్నర్‌పై నిషేధం కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. స్మిత్, వార్నర్ తమపై నిషేధాన్ని విభేదించలేదని మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ అన్నాడు. నిషేధాన్ని తగ్గించొద్దన్నాడు. గతంలో ఆసీస్ మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications