Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇండియా బెస్ట్ బ్యాటర్‌తో కలిసి ఆడటం నా అదృష్టం: ర్యాన్‌ రికెల్టన్

ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ‌పై ఆ జట్టు ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ ప్రశంసల జల్లు కురిపించాడు. రోహిత్ శర్మ ముంబై‌తో పాటు భారత అత్యుత్తమ బ్యాటర్ అని కొనియాడాడు. హిట్‌మ్యాన్‌తో కలిసి బ్యాటింగ్ చేయడం తన అదృష్టమని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో ర్యాన్ రికెల్టన్(32 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 83), రోహిత్ శర్మ(44 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 84) అద్భుతమైన భాగస్వామ్యంతో ముంబై విజయంలో కీలక పాత్ర పోషించారు. రోహిత్ కంటే దూకుడుగా ఆడిన ర్యాన్ రికెల్టన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఈ సందర్భంగా మాట్లాడిన ర్యాన్ రికెల్టన్.. రోహిత్ శర్మతో కలిసి బ్యాటింగ్ చేయడం తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు.

రోహిత్‌తో బ్యాటింగ్ చేయడం..

'రోహిత్ శర్మ ముంబై జట్టుకే కాదు.. భారతదేశపు అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరు. ఆయనతో కలిసి క్రీజులో సమయం గడపడం నాకు చాలా ఇష్టం. వాంఖడే వికెట్లు చాలా బాగుండటం మా అదృష్టం. మేం ఒకరికొకరం సహకరించుకుంటూ.. సరైన సమయంలో బౌలర్లపై ఒత్తిడి పెంచుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లగలిగాం.

One of India s Greatest Ryan Rickelton Hails Rohit Sharma After Dominant Opening Stand vs LSG
Photo Credit: screen grab for JioHotstar

నా ఆట తీరు వాంఖడే స్టేడియానికి సరిగ్గా సరిపోతుంది. ఈ విషయం గురించి రాహుల్ సంఘ్వీ (ముంబై ఇండియన్స్ డైరెక్టర్) కూడా నాతో చాలాసార్లు చెప్పారు. నా ఆట తీరు ఈ గ్రౌండ్‌కు సరిగ్గా సరిపోతుందని ఆయన తరుచూ చెబుతుండేవారు. నేను జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ నుంచి వచ్చాను. అక్కడ కూడా ఇక్కడిలాగే బంతి మంచి వేగంతో కూడిన బౌన్స్‌తో వస్తుంది. రాహుల్ చెప్పినప్పుడు నేను మొదట్లో నమ్మలేదు. కానీ, ఇప్పుడు నేను ఇక్కడ ఆడటాన్ని ఆస్వాదిస్తున్నాను.

అది ఆశ్చర్యంగా ఉంది..

ఇక్కడ బంతి వేగంగా వస్తుంది. మేం ఆడే షాట్లకు తగిన పరుగులు లభిస్తున్నాయి. అలాగే ఇక్కడ బంతి గాలిలో చాలా వేగంగా ప్రయాణిస్తుంది. అందుకే మా హోమ్ గ్రౌండ్‌కు తగ్గట్టుగా నా ఆటను మార్చుకున్నాను. బయట ప్రయాణించేటప్పుడు ఎప్పుడూ నేను మెరుగ్గా ఆడాలని చూస్తాను. కానీ ఈ స్టేడియంలో నాకంటూ ఒక బలమైన స్థానాన్ని సంపాదించుకోగలిగితే నాకు అంతకంటే సంతోషం లేదు.

ఈ రోజుల్లో ఐపీఎల్‌లో జరుగుతున్న ఈ ఛేజింగ్‌లు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. సూర్య చెప్పినట్లుగా నేను కూడా విన్నాను.. మనకు మంచి ఆరంభం దొరికితే.. అది భారీ స్కోరుకు పునాది వేస్తుంది. మా జట్టులో అదే ట్రెండ్ కొనసాగుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు మేం ఆ స్థాయిలో రాణించి ఉండకపోవచ్చు, కానీ 3వ స్థానం నుంచి 7, 8, 9 స్థానాల వరకు మా దగ్గర ఉన్న పవర్, ఆ క్లాస్ బ్యాటర్ల సత్తా చాలా గొప్పది.

అందుకే మేం పవర్‌ప్లేలో మంచి పునాది వేయగలిగితే.. నా పని పూర్తిగా పూర్తయిందని నేను అనను కానీ, మా తర్వాత వచ్చే బ్యాటర్ల నాణ్యత చూస్తుంటే నా బాధ్యత ఏమిటో నాకు స్పష్టంగా అర్థమవుతుంది.'అని ర్యాన్ రికెల్టన్ చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, May 5, 2026, 8:12 [IST]
Other articles published on May 5, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+