సచిన్ కెరీర్‌లో అ(ఇ)దో ప్రత్యేకమైన రోజు


హైదరాబాద్: రెండు దశాబ్దాలకు పైగా అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రికెటర్ సచిన్. 1989 నవంబరు 15వ తేదీన సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. కరాచీలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సచిన్ తొలి మ్యాచ్ ఆడాడు. సచిన్.. 16 ఏళ్ల వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అంత చిన్న వయస్సులోనే అరంగ్రేటం చేసిన క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. అయితే ఇంకా పదిలంగానే ఉండటం విశేషం.

వన్డే, టెస్టు ఫార్మాట్లలో కలిపి 100సెంచరీలు
వన్డే, టెస్టు ఫార్మాట్లలో కలిపి సచిన్ టెండూల్కర్ వంద సెంచరీలు వరకూ నమోదుచేశాడు. ఈ ఘనత సాధించిన తొలి, ఏకైక క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. దీంతో పాటుగా వన్డేల్లోనూ మొట్ట మొదటి డబుల్ సెంచరీ నమోదు చేసిన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. టెస్టులు, వన్డేల్లో కలిపి 30వేలకు పైగా పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.
మేరీ కోమ్ కొడితే మాత్రం ఆరోది, కొసావోతో భారత్ భవిష్యత్‌కు ముప్పు

10వేల పరుగుల తొలి క్రికెటర్‌గా
10వేల పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచిన సచిన్.. అవి పూర్తి చేసేందుకు 259 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత 10వేల పరుగుల మైలురాయిని విరాట్ కోహ్లీ.. ఆ మార్క్‌ను 205 ఇన్నింగ్స్‌ల్లో అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించాడు. తన కెరీర్‌లో ఆరు వన్డే వరల్డ్‌కప్‌లు ఆడిన సచిన్ టెండూల్కర్... మెగాటోర్నీలో అత్యధికసార్లు ఆడిన క్రికెటర్‌గానూ గుర్తింపు తెచ్చుకున్నాడు.

2013 నవంబర్‌లో వెస్టిండీస్‌తో టెస్టు తర్వాత
24 ఏళ్ల పాటు క్రికెట్ కెరీర్ కొనసాగించిన ఈ గాడ్ ఆఫ్ క్రికెట్.. 2013 నవంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ తర్వాత తన క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. తన క్రికెట్ అరంగేట్రపు రోజును గుర్తు చేసుకున్న సచిన్.. భారత్ జట్టుకు ప్రాతినిథ్యం వహించడాన్ని చిరస్మరణీయంగా పేర్కొన్నాడు. సుదీర్ఘకాలం భారత జట్టు తరపున ఆడే అవకాశం రావడం ఒక అరుదైన గౌరవమని స్మరించుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications