చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ఒకే ఒక్కడిగా..!
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుకు నాలుగేళ్లు పూర్తయ్యాయి. క్రికెట్ చరిత్రలోనే మరే క్రికెటర్‌కు సాధ్యం కానీ రికార్డును హిట్‌మ్యాన్ సొంతం చేసుకున్నాడు. సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే రోజు(జూలై 6, 2019) రోహిత్ శర్మ.. వరల్డ్ కప్‌లో అత్యధిక సెంచరీలు బాదిన ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు.
2019 వన్డే ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు బాదిన రోహిత్.. సింగిల్ ఎడిషన్‌లో ఈ ఘనతను అందుకున్న తొలి ప్లేయర్‌గా నిలిచాడు. శ్రీలంకతో జరిగిన ఫైనల్ లీగ్ మ్యాచ్‌లో 27వ వన్డే సెంచరీ బాదిన రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. ఇదే టోర్నీలో సౌతాఫ్రికా, పాకిస్థాన్, ఇంగ్లండ్‌లపై కూడా రోహిత్ శతకాలు అందుకున్నాడు.

ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర రికార్డును రోహిత్ అధిగమించాడు. 2015 వన్డే ప్రపంచకప్‌లో సంగక్కర నాలుగు సెంచరీలు బాదగా.. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఐదు శతకాలతో రోహిత్ ఆ రికార్డును బద్దలు కొట్టాడు.
ఈ రికార్డుకు నాలుగేళ్లు పూర్తయిన క్రమంలో రోహిత్ ఫ్యాన్స్.. మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా 2019 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ చేసిన సెంచరీలను షేర్ చేస్తున్నారు.
2019 వన్డే ప్రపంచకప్‌లో సౌథాంప్టన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో రోహిత్ 144 బంతుల్లో 122 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
అనంతరం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హిట్ మ్యాన్ 113 బంతుల్లో 140 పరుగులు చేయగా.. భారత్ రికార్డు విజయాన్నందుకుంది. ఇంగ్లండ్‌పై 109 బంతుల్లో 102 రన్స్ చేయగా.. భారత్ 31 పరుగుల తేడాతో గెలుపొందింది. బంగ్లాదేశ్‌పై 104 పరుగులు చేసిన రోహిత్.. శ్రీలంకపై 103 పరుగులు చేశాడు.
8 ఇన్నింగ్స్‌ల్లో 107.83 యావరేజ్‌తో 647 పరుగులు చేసిన రోహిత్.. ఐదు శతకాలతో పాటు ఓ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. లీగ్ దశలో దుమ్మురేపిన రోహిత్.. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో మాత్రం విఫలమయ్యాడు. దాంతో టీమిండియా ఫైనల్ చేరకుండానే ఇంటిదారిపట్టింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications