Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final: మహమ్మద్ షమీ మరో హ్యాట్రిక్ ప్లీజ్.. సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే సౌతాంప్టన్‌లో లాలాజీ మాయ..!

On this day in 2019 pacer Mohammed Shami became second Indian to take World Cup hat-trick

హైదరాబాద్: సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజు( 2019, జూన్ 22) టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ సాధించి మెగా ఈవెంట్‌లో ఈ ఘనత సాధించిన రెండో ఇండియన్ పేసర్‌గా చరిత్రకెక్కాడు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో లాలాజీ ఈ అరుదైన ఫీట్‌ను సాధించాడు. అయితే ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ జరుగుతున్న సౌతాంప్టన్ వేదికగానే షమీ హ్యాట్రిక్ సాధించడం విశేషం. దాంతో అభిమానులు ఈ మైమరిపించే రికార్డును గుర్తు చేసుకుంటూ మరో హ్యాట్రిక్ ప్లీజ్ అని అడుగుతున్నారు.

ఉత్కంఠకే ఊపిరందని మ్యాచ్‌లో..

ఉత్కంఠకే ఊపిరందని మ్యాచ్‌లో..

సౌతాంప్టన్‌ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన నాటి మ్యాచ్‌లో టీమిండియా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఆ మ్యాచ్‌లో‌ షమీ హ్యాట్రిక్‌ సాధించడంతో టీమిండియా ఊపిరిపీల్చుకుంది. 225 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ఆరంభించిన అఫ్గాన్‌కు ఆరంభం బాగానే ఉన్నప‍్పటికీ.. మిడిల్‌ ఓవర్లలో మాత్రం వికెట్లను కోల్పోయి ఓటమి పాలైంది. ప్రధానంగా షమీ వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో అఫ్గాన్‌ మూడు వికెట్లను వరుసగా కోల్పోయింది.

ఫస్ట్ బాల్ ఫోర్..

ఫస్ట్ బాల్ ఫోర్..

ఆఖరి ఓవర్‌లో అఫ్గాన్‌ విజయానికి 6 బంతుల్లో 16 పరుగులు అవసరం. కెప్టెన్ విరాట్ కోహ్లీ బంతిని షమీకి ఇచ్చాడు. అఫ్గానిస్తాన్‌ జట్టు కోసం ఒంటరి పోరాటం చేస్తున్న మహమ్మద్‌ నబీ స్ట్రైకింగ్‌లో ఉన్నాడు. షమీ తొలి బంతిని యార్కర్‌ వేయబోయి ఫుల్‌టాస్‌ వేశాడు. ఆ బంతిని నబీ ఫోర్‌ బాదాడు. దీంతో ఒక్కసారిగా భారత శిబిరంలో ఆందోళన నెలకొంది. మరుసటి బంతిని నబీ డీప్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా షాట్‌ ఆడాడు. సింగిల్‌ వచ్చే అవకాశం ఉన్నా తీయలేదు. ఇక నాలుగు బంతుల్లో 12 పరుగులుగా సమీకరణం మారింది. దీంతో బౌలర్‌ షమీపై ఒత్తిడి పెరిగింది.

ధోనీ సలహాతో..

ధోనీ సలహాతో..

అదే సమయంలోనే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన వ్యూహాన్ని అమలు చేశాడు. ధోనీ.. షమీ దగ్గరకు పరుగెత్తుకొచ్చి కొన్ని సూచనలు ఇచ్చాడు. అంనతరం ఫీల్డింగ్‌ మార్చుకున్న షమీ.. యార్కర్‌ సంధించాడు. దీన్ని నబీ లాంగాన్‌ దిశగా భారీ షాట్‌ ఆడగా.. బౌండరీ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న ప్యాండ్యా చేతిలో పడింది. భారత శిబిరంలో ఆనందం వెల్లువిరిసింది. మరుసటి రెండు బంతులను యార్కర్లతో అప్తాబ్‌ అలామ్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌లను క్లీన్‌బౌల్డ్‌ చేసాడు. దీంతో లాలాజీ ప్రపంచకప్‌లో హ్యాట్రిక్‌ తీయడంతో పాటు టీమిండియాకు విజయాన్ని అందించాడు.

లాలాజీ మరో హ్యాట్రిక్ ప్లీజ్..

లాలాజీ మరో హ్యాట్రిక్ ప్లీజ్..

ఒక ప్రపంచకప్‌లో హ్యాట్రిక్‌ సాధించిన రెండో టీమిండియా బౌలర్‌గా మహమ్మద్ షమీ రికార్డు సాధించాడు. అంతకుముందు చేతన్‌ శర్మ హ్యాట్రిక్‌ తీశాడు. 1987 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై చేతన్‌ శర్మ హ్యాట్రిక్‌ తీయగా.. అతని సరసన షమీ నిలిచాడు. అది జరిగి నేటికి రెండేళ్లు కావడం.. మరోవైపు ఇదే సౌతాంప్టన్ వేదికపై ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ జరుగుతుండటంతో అభిమానులు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.

లాలాజీ మరో హ్యాట్రిక్ ప్లీజ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌటవ్వగా.. న్యూజిలాండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 101 రన్స్ మాత్రమే చేసింది.

Story first published: Tuesday, June 22, 2021, 15:41 [IST]
Other articles published on Jun 22, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+