
లెక్కలేనన్ని రికార్డులు
'22 గజాల పిచ్ మీద 24 ఏళ్లు గడిపాను. నా క్రికెట్ ప్రయాణం ముగిసిందని నమ్మలేకపోతున్నా' అని మ్యాచ్ అనంతరం లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ భావోద్వేగానికి లోనయ్యారు. చేతిలో జాతీయ జెండాతో అభిమానులకు అభివాదం చేసిన సచిన్.. భారమైన హృదయంతో క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఇక సచిన్ రిటైర్మెంట్ వేళ కోట్లాది మంది అభిమానులు, తోటి క్రికెటర్లు భావోద్వేగానికి లోనయ్యారు. ఇక క్రికెట్‌లో లెక్కలేనన్ని రికార్డులు సాధించిన సచిన్ ఘనతలను ఐసీసీ, అభిమానులు గుర్తుచేస్తూ.. ఈరోజు ట్విటర్‌లో పోస్ట్‌లు చేస్తున్నారు.

22 గజాల మధ్య 24 ఏళ్లు
'22 గజాల మధ్య 24 ఏళ్లుగా కొనసాగిన నా జీవితం ముగిసిందంటే నమ్మశక్యంగా లేదు. భారత అభిమానులు భావోద్వేగానికి గురైన రోజు ఇది. వాంఖడేలో వెస్టిండీస్‌పై ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించిన తర్వాత సచిన్ తన అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు' అని ఐసీసీ ట్వీట్ చేసింది. 'ఆటకు వీడ్కోలు పలికిన సమయంలో సచిన్ మాటలు మీకు గుర్తున్నాయా?' అని అభిమానులను ఉద్దేశించి సచిన్ మాట్లాడిన వీడియోని ఈఎస్‌పీన్ క్రికెఇన్ఫో ట్వీట్ చేసింది. రాజస్థాన్, హైదరాబాద్, ముంబై జట్లు కూడా తమ ట్విటర్‌లో సచిన్ గురించి పోస్టులు చేశాయి.

అత్యంత విలువైందిగా భావించే
ఇక చిన్నతనం నుంచి సచిన్ టెండూల్కర్ ఆట చూస్తూ పెరిగిన విరాట్ కోహ్లీ.. అంచెలంచెలుగా ఎదిగి అతనితోనే కలిసి ఆడాడు. తన అభిమాన క్రికెటర్ రిటైర్మెంట్ రోజున విరాట్ ఉద్వేగానికి లోనయ్యాడు. సచిన్ జీవితంలో అంతా సవ్యంగా జరగాలని కోరుకుంటూ.. తన ఆరాధ్య క్రికెటర్‌కు పవిత్ర దారాన్ని విరాట్ బహుమతిగా ఇచ్చాడు. వాస్తవానికి ఈ దారాన్ని కోహ్లీకి ఆయన తండ్రి ఇచ్చారు. దాన్ని కోహ్లీ ఎప్పుడూ తన బ్యాగ్‌లోనే దాచుకునేవాడు. విరాట్ ఎక్కడికి వెళ్లినా అది వెంటే ఉంటుంది. ఆ దారాన్ని అత్యంత విలువైందిగా భావించే విరాట్.. సచిన్‌పై ఉన్న గౌరవంతో ఆయనకు ఇచ్చేశాడు. 'మీకు ఇవ్వడానికి ఇంత కంటే విలువైన గిఫ్ట్ ఏదీ నా వద్ద లేదు. నాపై మీ ప్రభావం ఎంతో ఉంది. మీరంటే మాకెంత ఇష్టమో చెప్పడానికి ఈ దారమే నిదర్శనం' అని కోహ్లీ అప్పుడు సచిన్‌తో అన్నాడు.

100 శతకాలు
1989 నుంచి 24 ఏళ్ల పాటు క్రికెట్ ఆడిన సచిన్.. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 శతకాలు నమోదు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా రికార్డ్ నెలకొల్పారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యంకానన్ని పరుగులతో సచిన్ అగ్రస్థానంలో నిలిచారు. లిటిల్ మాస్టర్ తన కెరీర్ మొత్తంలో 34,357 పరుగులు బాదారు. టెస్టుల్లో 15,921.. వన్డేల్లో 18426, టీ20ల్లో 10 రన్స్ చేశారు. వన్డేల్లో తొలి ద్విశతకం బాదిన క్రికెటర్‌గా సచిన్ చరిత్ర సృష్టించారు.
ఒక్క సిక్స్ కొట్టలేదు.. ఒక్కో పరుగు ఖరీదు రూ.10 లక్షలు!! పంజాబ్ ఆ ముగ్గురిని వదిలేయాల్సిందే!


Click it and Unblock the Notifications
