For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Sachin Tendulkar: కెట్ చరిత్రలోనే మరుపురాని రోజు.. ఆ అద్భుతానికి 9 ఏళ్లు!

On This Day In 2012: Sachin Tendulkar Scored His 100th International Century

ముంబై: భారత క్రికెట్ దిగ్గజం స‌చిన్ టెండూల్క‌ర్.. తన 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. అయితే, అతని కెరీర్‌లో అనితర సాధ్యమైన రికార్డు సాధించి నేటికి 9 ఏళ్లు పూర్త‌వుతోంది. 2012లో(మార్చి 16) ఇదే రోజున సచిన్.. 100వ సెంచరీ సాధించాడు. సెంచరీల సెంచరీ చేసి క్రికెట్ చరిత్రలో మరెవరికీ సాధ్యం కానీ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు.

ఆసియా కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌పై 114 పరుగులు చేసిన ఈ ఘనతను అందుకున్నాడు. అందుకే మార్చి 16.. భారత క్రికెట్ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోయే రోజు. సచిన్​కు ముందు.. సచిన్​కు తర్వాత అన్న మాటను మరోసారి నిజం చేస్తూ.. ప్రతి భారత క్రికెట్ అభిమాని గర్వపడేలా .. చరిత్రను తిరగరాస్తూ మాస్టర్ సాధించిన ఆ శతకం ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఓ మరపురాని ఘట్టం.

ఆసియా కప్-2012లో భాగంగా బంగ్లాదేశ్​తో జరిగిన వన్డే మ్యాచ్​లో సచిన్ టెండూల్కర్ ఈ ఘనతను అందుకున్నాడు. ఈ సెంచరీ సచిన్​కు వన్డేల్లో 49వది. అలాగే అప్పటికే టెస్టుల్లో 51 సెంచరీలు చేయడం వల్ల ప్రపంచ క్రికెట్​లో 100 శతకాలు బాదిన ఏకైక ఆటగాడిగా మాస్టర్ చరిత్ర సృష్టించాడు. అయితే సచిన్ సెంచరీ చేసినా కూడా ఈ మ్యాచ్​లో టీమిండియా ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 290 పరుగులు చేయగా.. మరో నాలుగు బంతులు మిగిలుండగానే బంగ్లాదేశ్ లక్ష్యాన్ని ఛేదించింది.

సచిన్ కెరీర్​లో మొత్తం 164 అర్ధసెంచరీలు ఉన్నాయి. సచిన్ తర్వాత అత్యధిక సెంచరీల జాబితాలో 71 శతకాలతో రికీ పాంటింగ్ రెండో స్థానంలో నిలవగా.. కోహ్లీ 70 సెంచరీలతో ఉన్నాడు. తన 24 ఏళ్ల కెరీర్​లో మొత్తం 34,357 పరుగులు సాధించాడు. వన్డే క్రికెట్‌లో తొలి డబుల్ సెంచరీ చేసిన ఆటగాడు కూడా సచినే.

Story first published: Tuesday, March 16, 2021, 14:28 [IST]
Other articles published on Mar 16, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+