రికార్డు భాగస్వామ్యం..
టాంటన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో దాదా-ద్రవిడ్ విధ్వంసం ధాటికి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన శ్రీలంక చిత్తయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లంక కెప్టెన్ అర్జున రణతుంగ ఇండియాను బ్యాంటింగ్‌కు ఆహ్వానించాడు. ఆరంభంలోనే చమింద వాస్‌తో వికెట్లు తీయించే ప్రణాళిక వేశాడు. అందుకు తగ్గట్టే మొదటి ఓవర్లోనే దాదా ఓపెనింగ్ భాగస్వామి శఠగోపన్ రమేశ్‌ను వాస్ పెవిలియన్ పంపించాడు. కానీ అప్పుడే అసలు ఆట మొదలైంది. దాదా- ద్రవిడ్ లంక బౌలర్లను చెడుగుడాడారు. 44.5 ఓవర్ల పాటు క్రీజులో నిలిచి 318 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. వన్డేల్లో ఇంత భారీ భాగస్వామ్యం సాధించడం అదే తొలిసారి.

శైలికి భిన్నంగా..
ద్రవిడ్ తన సహజ శైలికి భిన్నంగా ఆడాడు. వరుసగా బౌండరీలు బాదేశాడు. అవన్నీ మైదానాన్ని ముద్దాడుతూ బౌండరీ సరిహద్దులు దాటేశాయి. అలా మిస్టర్ డిపెండబుల్ ఆ ప్రపంచకప్‌లో రెండో సెంచరీ అందుకున్నాడు. మరోవైపు గంగూలీ వీర విహారం చేశాడు. 119 బంతుల్లో శతకం పూర్తి చేశాడు. ఆ తర్వాత ముత్తయ్య మురళీధరన్, సనత్ జయసూర్యకు చుక్కలు చూపించాడు. కేవలం 39 బంతుల్లోనే మరో 83 పరుగులు పిండుకున్నాడు. వికెట్‌పై తన బ్యాటుతో నాట్యం చేశాడు.

టీమిండియా బెస్ట్ స్కోర్..
ఇక విక్రమ సింఘే బౌలింగ్‌లో గంగూలీ పెవిలియన్ చేరడం, ముత్తయ్య మురళీధరన్ అద్భుత త్రోకు ద్రవిడ్ రనౌట్ కావడంతో ఈ సూపర్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. అయితే ఈ మ్యాచ్‌లో సచిన్ (2), అజయ్ జడేజా (5), రాబిన్ సింగ్( 0) విఫలమవ్వగా... కెప్టెన్ అజారుద్దీన్ (12 నాటౌట్) అజేయంగా నిలిచాడు. లంక బౌలర్లలో ప్రమోద్య విక్రమ సింఘే అత్యధికంగా మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దాదా- ద్రవిడ్ ధాటికి ప్రపంచకప్‌లో భారత్.. అత్యుత్తమ స్కోరును 373 సాధించింది.

చెలరేగిన రాబిన్ సింగ్..
భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని లంక ఛేదించలేకపోయింది. రాబిన్ సింగ్ 5 వికెట్లతో చెలరేగడంతో 216కే కుప్పకూలింది. దాంతో టీమిండియా 157 పరుగుల తేడాతో విజయాన్నందుకుంది.
రాబిన్‌కు తోడుగా శ్రీనాథ్, అనిల్ కుంబ్లే, మొహంతి తలో వికెట్ తీశారు. కాగా ఈ మెగా టోర్నీలో గ్రూపు స్టేజ్‌లో ఐదింటికి ఐదు మ్యాచ్‌లు గెలిచిన భారత్, సూపర్ 8లో భాగంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. ఆ ఏడాది ఆస్ట్రేలియా ప్రపంచకప్ విజేతగా నిలిచింది.


Click it and Unblock the Notifications
