Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 Final: గుజరాత్ టైటాన్స్‌ కోసమే మ్యాచ్ వాయిదా పడిందా? మళ్లీ ఆ జట్టే గెలుస్తుందా?

అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్ టైటిల్ గుజరాత్ టైటాన్స్‌దేనా? గ్రహాలు ఆ జట్టుకే అనుకూలంగా ఉన్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్‌-గుజరాత్ టైటాన్స్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్ డే అయిన సోమవారానికి వాయిదా పడింది.

ఎడతెరిపి లేకుండా వర్షంతో పడటంతో మైదానం మొత్తం చిత్తడిగా మారింది. దాంతో అంపైర్లు ఆటను వాయిదా వేశారు. అయితే ఈ నిర్ణయం గుజరాత్ టైటాన్స్‌కు కలిసొస్తుందని ఆ జట్టు ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎందుకంటే గతేడాది ఇదే రోజు(మే29)న గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ టైటిల్ గెలిచింది. ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్‌ను మట్టికరిపించి అరంగేట్రం చేసిన తొలి సీజన్‌లోనే టైటిల్ ముద్దాడింది.

gujarat titans ipl team

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 130 పరుగులే చేసింది. జోస్ బట్లర్(39) టాప్ స్కోరర్‌గా నిలవగా.. హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు తీసాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్.. మరో 11 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది.

ఐపీఎల్ 2023 సీజన్‌లోని ఫైనల్ మ్యాచ్ మే 28న జరగాల్సి ఉన్నా.. వర్షంతో నేటి(మే 29)కి వాయిదా పడిన విషయం తెలిసిందే. దాంతో గతేడాది ఫైనల్ మ్యాచ్ జరిగిన తేదీనే ఈసారి కూడా ఫైనల్ జరుగనుంది. ఈ సీజన్‌లోనూ అద్భుత ప్రదర్శనతో గుజరాత్ జట్టు ఫైనల్ చేరింది. దీంతో గతేడాది మే 29న తొలిసారి కప్పు కొట్టిన మాదిరిగానే.. ఈ ఏడాది అదే తేదీన రెండో ట్రోఫీ కూడా గెలుస్తామని గుజరాత్ ఫ్యాన్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

ట్విటర్ వేదికగా గతేడాది ట్రోఫీ గెలిచిన ఫొటోలను షేర్ చేస్తూ హిస్టరీ రిపీట్ చేస్తామని కామెంట్ చేస్తున్నారు.

Story first published: Monday, May 29, 2023, 16:28 [IST]
Other articles published on May 29, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+