For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లండ్ తొండాటకు రెండేళ్లు! సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించిన మ్యాచ్.. ఓడి గెలిచిన కివీస్!

On This Day England Becomes First Time Worldcup Winners On New Zealand

న్యూఢిల్లీ: ఉత్కంఠకు కూడా ఊపిరి అందలేదు.. వారి ఆటను చూసి..! అద్భుతానికి కూడా ఆలోచన తట్టలేదు నాటి పోరాటాన్ని చూసి.. అధ్యాంతం థ్రిల్లింగ్ మూవీని తలపించిన ఆ మ్యాచ్‌లో ఒక్కో బంతి.. ఒక్కో గుండెను తట్టిలేపింది. ఒక్కొక్క పరుగు.. భావోద్వేగాన్ని మెలివేసింది. ఒక్కో ప్రార్థన.. ఒక్కో దైవాన్ని మేలుకొలిపింది. నాలుగున్నర దశాబ్దల కల... ఏడున్నర గంటల్లో తేలకపోయినా.. నాలుగున్నర నిమిషాల మహా సంగ్రామంలో మెరిసి మురిసింది. హృదయంతరాల్లో గూడుకట్టుకుపోయిన తీరని వేదన.. అర సెకన్‌లో తేలిపోయింది. మెట్టినింట నలుగురు మెచ్చిన ఆట.. పుట్టింటికి తొలి విశ్వ కానుక అందించింది.

తొలిసారి జగ్గజేతగా నిలిచిన ఇంగ్లండ్.. విశ్వవిజేతల సరసన ఠీవీగా కూర్చుంది. మెగాటోర్నీ చరిత్రలోనే తొలిసారి సూపర్ ఓవర్‌కు దారి తీసిన నాటి ఫైనల్ మ్యాచ్‌ అప్పుడే రెండేళ్లు పూర్తి చేసుకుంది. సరిగ్గా రెండేళ్ల క్రితం(2019, జూలై 14) ఇదే రోజు యావత్ క్రికెట్ ప్రపంచానికి కనీవినీ ఎరగని రీతీలో కావాల్సిన మజా లభించింది. క్రికెట్ మక్కా లార్డ్స్ మైదానం వేదికగా జరిగిన నాటి మ్యాచ్‌లో ఎన్నో ములపులు.. మరెన్నో భావోద్వేగాలు మిళితమయ్యాయి. ఏడాది పూర్తయిన సందర్భంగా క్రికెటర్లు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా నాటి థ్రిల్లర్ మ్యాచ్‌ను స్మరించుకుంటున్నారు.

మ్యాచ్ టై..

మ్యాచ్ టై..

ఇక టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు 241 పరుగులు చేసింది. హెన్రీ నికోలస్(55).. టామ్ లాథమ్(47) టాప్‌స్కోరర్లుగా నిలవగా.. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, లియమ్ ప్లంకెట్ మూడేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేజింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. బెన్ స్టోక్స్(84 నాటౌట్) అజేయ పోరాటానికి జోస్ బట్లర్(59) సూపర్ ఇన్నింగ్స్ తోడవడంతో.. నిర్ణీత 50 ఓవర్లలో సరిగ్గా 241 పరుగులకే ఆలౌటైంది. దీంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్‌కు దారితీసింది. ఇక సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 15 పరుగులు చేసింది. తర్వాత న్యూజిలాండ్ కూడా అదే 15 పరుగులు చేయడంతో అసంబద్దమైన బౌండరీల నిబంధన ఆధారంగా ఇంగ్లండ్ విజేతగా నిలిచింది.

కలిసొచ్చిన అదృష్టం...

కలిసొచ్చిన అదృష్టం...

ఇక ఇంగ్లండ్‌కు అదృష్టం కలిసిరాగా.. న్యూజిలాండ్ ఆటగాళ్ల నెత్తులపై దురదృష్టం తాండవం చేసింది. 49 ఓవర్ నాలుగో బంతిని స్టోక్స్ మిడ్ వికెట్‌ మీదుగా భారీ షాట్ ఆడగా.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న బౌల్ట్ అద్భుతంగా బంతిని అందుకున్నాడు. మ్యాచ్ విన్నింగ్ క్యాచ్ అని, విశ్వవిజేత న్యూజిలాండే అనుకున్నారంతా. కానీ బంతని అందుకున్న బౌల్ట్ సమన్వయం కోల్పోయి బౌండరీ లైన్ తొక్కడంతో ఔట్ కాస్త సిక్స్‌గా మారింది. దీంతో సీన్ రివర్స్ అయింది.

వివాదస్పద 6 పరుగులు..

వివాదస్పద 6 పరుగులు..

ఇక చివరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 15 పరుగులు కావాల్సి ఉండగా.. స్టోక్స్ తొలి రెండు బంతులను డాట్ చేశాడు. దీంతో సమీకరణం 4 బంతుల్లో 15 పరుగులుగా మారింది. అద్భుతం జరిగితేనే ఇంగ్లండ్ విజయం అనుకున్నారు. కానీ అత్యద్భుతమే జరిగింది. బౌల్ట్ వేసిన మూడో బంతిని స్టోక్స్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ కొట్టి ఇంగ్లండ్ శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. ఇక ఫుల్ టాస్ వేసిన నాలుగో బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా స్టోక్స్ షాట్ ఆడగా.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న మార్టిన్ గప్టిల్ బంతిని అందుకొని వికెట్లకు త్రో విసిరాడు. అది కాస్త పరుగు పూర్తి చేసిన స్టోక్స్ బ్యాట్‌కు తగిలి బౌండరీకి వెళ్లింది. అప్పటికే స్టోక్స్ రెండు పరుగులు తీయడం.. బౌండరీ ద్వారా 4 రన్స్ రావడంతో అంపైర్లు 6 పరుగులని ప్రకటించారు. దీంతో విజయ సమీకరణం 2 బంతుల్లో 3 పరుగులైంది. అనంతరం రెండు బంతులు పరుగులు తీసి రనౌటయ్యారు.

 తీవ్ర విమర్శలు..

తీవ్ర విమర్శలు..

ఇరు జట్లు ఆఖరి క్షణం వరకు సమఉజ్జీలుగా పోరాడి సమంగా నిలిచినా.. బౌండరీల కౌంట్ ద్వారా ఫలితాన్ని తేల్చడం చాలా మంది అభిమానులకు నచ్చలేదు. దీంతో ఈ బౌండరీల నిబంధనపై పెను దుమారం రేగింది. అలాగే బ్యాట్ తగిలి బౌండరీ వెళ్లిన దానికి 6 పరుగులు ఇవ్వడం కూడా క్రీడా స్పూర్తి విరుద్దమనే విమర్శలు వినిపించాయి. అంతేకాకుండా నిబంధనల ప్రకారం ఐదు పరుగులే ఇవ్వాలని, అంపైర్లు ఉద్రిక్తతలను తట్టుకోలేక తప్పిదం చేశారని స్పష్టమైంది.

తీవ్ర విమర్శల నేపథ్యంలో ఐసీసీ బౌండరీల కౌంట్ నిబంధనను తొలగించింది. ఇక ఇంగ్లండ్ ప్రపంచకప్ గెలుచుకున్నా.. న్యూజిలాండ్ మాత్రం అభిమానుల మనసులను గెలుచుకుంది. అంత జరిగినా ఎలాంటి భావోద్వేగాలను ప్రదర్శించకుండా క్రీడా స్పూర్తికి సరైన ఉదహారణగా నిలిచింది. ఇలా అనేక విమర్శలు.. భావోద్వేగాలతో థ్రిల్లింగ్ సినిమాను తలపించిన ఈ మ్యాచ్ క్రికెట్ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయింది.! అయితే తొండాటతో ప్రపంచకప్ గెలుచుకుందనే అపవాదును మాత్రం ఇంగ్లండ్ మూటగట్టుకుంది!

Story first published: Wednesday, July 14, 2021, 10:05 [IST]
Other articles published on Jul 14, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+