Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

62 ఫోర్లు, 10 సిక్సర్లతో 501 పరుగులు.. అన్‌బ్రేకబుల్ రికార్డ్!

హైదరాబాద్: బ్రియాన్ లారా.. క్రికెట్ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. క్రికెట్‌ను ఆరాధించే ప్రతీ ఒక్కరికి ఈ వెస్టిండీస్ దిగ్గజం గురించి కచ్చితంగా తెలిసే ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. నైంటీస్‌లో సచిన్ టెండూల్కర్‌తో పాటు బ్రియాన్ లారా తన ఆటతో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించాడు.

29 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు( జూన్ 6, 1994) బ్రియాన్ లారా.. క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 501 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దర్హమ్‌తో జరిగిన నాటి మ్యాచ్‌లో వార్‌విక్‌షైర్ తరఫున బరిలోకి దిగిన లారా.. 427 బంతుల్లో 62 ఫోర్లు, 10 సిక్సర్లతో ఈ ఫీట్ సాధించాడు.

On This Day Brian Lara registered the highest-ever First-class score

దాంతో అప్పటి వరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో టాప్ స్కోరర్‌గా ఉన్న హానీఫ్ మహ్మద్(499) రికార్డు బద్దలయ్యింది. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ బ్రియాన్ లారా అసాధారణమైన ఆటతీరుతో ఎన్నో రికార్డులను నెలకొల్పాడు. 131 టెస్టుల్లో 11,953 పరుగులు.. 299 వన్డేల్లో 10405 రన్స్ చేశాడు. టెస్ట్‌ల్లో 34 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలు బాదిన లారా.. వన్డేల్లో 19 శతకాలు, 63 అర్థశతకాలు నమోదు చేశాడు.

ఇక టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ 400 నాటౌట్ కలిగిన ప్లేయర్‌గానూ లారా చరిత్రకెక్కాడు. ఇప్పటి వరకు ఈ రికార్డులు బ్రేక్ అవ్వలేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం క్రికెట్ అనలిస్ట్, కామెంటేటర్, కోచ్‌గా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లారా.. తన వ్యాఖ్యానంతో అదరగొట్టినా.. కోచ్‌గా మాత్రం సక్సెస్ కాలేకపోతున్నాడు.

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచ్‌‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న లారా.. జట్టుకు కావాల్సిన ఫలితాన్ని అందించడంలో విఫలమయ్యాడు. స్టార్ ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టలేకపోయాడు. దాంతో ఐపీఎల్ 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ దారుణంగా విఫలమైంది. 14 మ్యాచ్‌ల్లో నాలుగు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది.

ఈ పరాజయం నేపథ్యంలో కోచ్ బ్రియాన్ లారాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. లారా అనాలోచిత నిర్ణయాలు, పదే పదే జట్టును మార్చడం వల్లే సన్‌రైజర్స్‌కు ఈ గతి పట్టిందని ఫ్యాన్స్ మండిపడ్డారు. ఈ క్రమంలోనే వచ్చే సీజన్‌లో అతను కోచ్‌గా కొనసాగడంపై సందేహాలు నెలకొన్నాయి.

Story first published: Tuesday, June 6, 2023, 17:28 [IST]
Other articles published on Jun 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+