For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మైనర్‌తో శృంగారం .. కటకటాల్లో ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్!

 Olympic Gold Medalist Conseslus Kipruto Charged With Having Sex With a Minor

నైరోబి (కెన్యా): కెన్యా స్టార్‌ అథ్లెట్‌, ఒలింపిక్స్‌ గోల్డ్ మెడల్ విన్నర్ కాన్స్‌సలస్‌ కిప్రుటో అత్యాచార కేసులో చిక్కుకున్నాడు. గతనెలలో 15 ఏళ్ల ఓ మైనర్‌ బాలికతో శృంగారం చేశాడనే ఆరోపణలతో 25 ఏళ్ల కిప్రుటోను ఈనెల 11న పోలీసులు అరెస్టు చేశారు. కెన్యా లైంగిక నేర నియంత్రణ చట్టాల ప్రకారం 18ఏళ్ల లోపు బాలికతో శృంగారం నిషిద్ధం.

ఇటీవలే బెయిల్‌పై జైలు నుంచి విడుదలవ్వగా.. కిప్రుటో నేరం రుజువైతే 20 ఏళ్ల జైలుశిక్షకు గురయ్యే అవకాశముంది. స్వయంగా పోలీస్‌ అధికారి అయిన కిప్రుటో.. బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యే క్రమంలో మీడియా ఫొటోలకు చిక్కకుండా ఫేస్‌ను కవర్ చేసుకున్నాడు. కిప్రుటో అత్యాచారం చేశాడన్న బాలిక.. ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిందని, బాధితురాలు అతని ఇంట్లో మూడు రోజులు ఉందని కెన్యా మీడియా పేర్కొంది.

2016 రియో ఒలింపిక్స్‌లో 3000 మీటర్ స్టీపుల్‌ఛేజ్‌ గోల్డ్ మెడల్ నెగ్గిన కిప్రుటో.. 2017, 2019 వరల్డ్ చాంపియన్‌షిప్‌లను కూడా గెలుచుకున్నాడు. ఈ సీజన్‌లో మాత్రం అతను పోటీ పడలేదు. కరోనా వైరస్ బారిన పడటంతో మొనకో వేదికగా ఆగస్టులో జరిగిన డైమండ్ లీగ్ మీట్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత కరోనా నుంచి కోలుకున్నా.. ఇప్పుడీ కేసుతో అతను టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనడంపై అనుమానమే.

Story first published: Wednesday, November 18, 2020, 8:38 [IST]
Other articles published on Nov 18, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+