ఒకే ఓవర్లో 3 వికెట్లు.. అతని బౌలింగ్‌ను వైభవ్ సూర్యవంశీ ఆడగలడా..?
ఇంగ్లండ్ పేసర్ రాబిన్సన్ నిప్పులు చెరిగాడు. తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో రాబిన్సన్ ఈ ఫీట్ సాధించాడు. గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఫస్ట్ ఓవర్‌తోనే రాబిన్సన్ ఆకట్టుకున్నాడు.
మెయిడిన్ ఓవర్‌తో పాటు మూడు కీలక వికెట్లు తీసాడు. రాబిన్సన్ ప్రదర్శనను చూసిన క్రికెట్ అభిమానులు.. వైభవ్ సూర్యవంశీని తెరపైకి తీసుకొచ్చాడు. రాబిన్సన్ బౌలింగ్‌లో వైభవ్ నిలబడగలడా? అనే చర్చకు తెరలేపారు.
స్వింగ్ కండిషన్స్‌లో..
వర్షం కారణంగా ఈ టెస్ట్ మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. ఆ తర్వాత కండిషన్స్ స్వింగ్‌కు అనుకూలించడంతో రాబిన్సన్ చెలరేగాడు. తొలి రెండు బంతులను డాట్ చేసిన అతను.. మూడో బంతిని డేవాన్ కాన్వేను ఔట్ చేశాడు. నాలుగో బంతిని డాట్ చేయగా.. ఐదో బంతికి కేన్ విలియమ్సన్ వెనుదిరిగాడు. ఆరో బంతికి రచిన్ రవీంద్రను పెవిలియన్ చేర్చి న్యూజిలాండ్‌ను కోలుకోలేని దెబ్బతీసాడు. మూడు వికెట్లతో పాటు మెయిడెన్ ఓవర్ వేసి ఇంగ్లండ్‌కు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు.

వైభవ్ ఆడగలడా..?
ఈ ఓవర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే ఆసక్తికర ప్రశ్న తెరపైకి వచ్చింది. ఇలాంటి అద్భుతమైన స్వింగ్ బౌలింగ్‌ను 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆడగలడా? అనే చర్చ మొదలైంది. 'వైభవ్ ఇలాంటి స్వింగ్ కండిషన్స్‌లో నిలబడటం కష్టమే' అని కొందరు అంటే.. మరికొందరు అతను ఇంకా భారత జట్టుకు ఆడలేదని, ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ఎలా ఆడతాడో అంచనా వేయడం సరికాదని కామెంట్ చేశారు.
ఐపీఎల్‌లో వరల్డ్ క్లాస్ బౌలర్లు అయిన బుమ్రా, భువనేశ్వర్ కుమార్, రబాడ, జోష్ హేజిల్ వుడ్, మిచెల్ స్టార్క్‌లను చితక్కొట్టిన వైభవ్ సూర్యవంశీకి రాబిన్సన్ పెద్ద లెక్క కాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఐపీఎల్ ఆడినంత సులువు టెస్ట్ క్రికెట్ కాదని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు.
బౌలర్లదే హవా..
బౌలర్లు రాజ్యమేలుతున్న ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 140 పరుగులకు ఆలౌటవ్వగా.. న్యూజిలాండ్ 113 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్‌లో హ్యారీ బ్రూక్(56) ఒక్కడే హాఫ్ సెంచరీ చేయగా.. న్యూజిలాండ్‌లో కైల్ జెమీసన్(38 నాటౌట్), గ్లేన్ ఫిలిప్స్(34) టాప్ స్కోరర్లుగా నిలిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో కైల్ జెమీసన్(5/62) ఐదు వికెట్లు తీయగా.. ఇంగ్లండ్ రాబిన్సన్(5/39) ఈ ఫీట్ సాధించాడు. 27 ప రుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ నిలకడగా ఆడుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

