Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒకే ఓవర్‌లో 46 పరుగులు.. ఇంగ్లండ్ బౌలర్ చెత్త రికార్డ్! (వీడియో)

ఇంగ్లండ్ పేసర్ ఓలీ రాబిన్సన్ క్రికెట్ చరిత్రలోనే కని వినీ ఎరుగని చెత్త రికార్డును నమోదు చేశాడు. ఒకే ఓవర్‌లో 46 పరుగులు సమర్పించుకొని అత్యధిక రన్స్ ఇచ్చిన బౌలర్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. 134 ఏళ్ల కౌంటీ క్రికెట్ చరిత్రలో మరే బౌలర్

కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా లీసెస్ట‌ర్‌షైర్‌ వర్సెస్ సస్సెక్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఓలీ రాబిన్సన్ ఈ చెత్త రికార్డను నమోదు చేశాడు.

Ollie Robinson Bowls Most Expensive Over In 134 Years after He Concedes 46 Runs In 1 Over

బుధవారం జరిగిన ఈ మ్యాచ్ నాలుగో రోజు ఆటలో సస్సెక్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఓలీ రాబిన్సన్ బ్యాటర్ల విధ్వంసానికి బలిపశువు అయ్యాడు. రాబిన్సన్ బౌలింగ్‌లో లీసెస్టర్ బ్యాటర్ లూయిస్ కింబర్ 43 రన్స్ కొట్టగా.. మరో 3 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి.

ఈ ఓవర్‌లో రాబిన్సన్ మూడు నోబాల్స్‌తో కలిసి మొత్తం 9 బంతులు వేయగా.. కింబర్ ఐదు సిక్స్‌లతో పాటు మూడు బౌండరీలు బాదాడు. కింబర్ మూడు నోబాల్స్‌ను సిక్స్‌లుగా తరలించడం విశేషం. ఈ ఓవర్‌లో అతను వరుసగా 6, 6నోబాల్, 4, 6, 4, 6నోబాల్, 4, 6 నోబాల్, 1 పరుగులు చేశాడు.

ఈ విధ్వంసకర బ్యాటింగ్ కింబర్ చరిత్ర సృష్టించాడు. ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్, రవిశాస్త్రిలను అధిగమించాడు. ఈ ఇద్దరూ 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాది 36 పరగులతో ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

తాజా కింబర్ 43 పరుగులతో వీరిని అధిగమించాడు. ఓలీ రాబిన్సన్ రికార్డ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Story first published: Wednesday, June 26, 2024, 20:40 [IST]
Other articles published on Jun 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+