
తిరువనంతపురం: మన దేశంలో క్రికెట్‌ను ఆరాధ్య దైవంగా భావిస్తారనే విషయం తెలిసిందే. చిన్నా, పెద్ద తేడా లేకుండా మ్యాచ్‌లను వీక్షిస్తూ ఎప్పుడూ భారత జట్టే గెలవాలని కోరుకుంటారు. ఓటమిని అస్సలు సహించరు. ఇక ఖాళీ దొరికితే బ్యాట్, బంతి అందుకొని తమ క్రికెట్ నైపుణ్యానికి పనిచెబుతారు.
ఎలాంటి వసతులు లేకున్నా... తమకు అందుబాటులో ఉన్న స్థలంలోనే అడ్జస్ట్ అవుతారు. దాన్నే గల్లీ క్రికెట్ అని కూడా పిలుస్తుంటారు. ఎవరికి వారే రూల్స్ నిర్ణయించుకుంటారు. వన్ స్టప్ క్యాచ్... మూడు బంతులు మిస్ చేస్తే ఔట్.. నేరుగా గోడ తాకితే సిక్స్.. బయటపడితే ఔట్.. అంటూ తమకు తోచిని నిబంధనలను పెట్టుకుంటారు.
ఇక తాజా కరోనా పుణ్యమా.. అటు అంతర్జాతీయ క్రికెట్ నిలిచిపోయి.. ఇటు దేశమంతా లాక్‌డౌన్ విధించడంతో జనాలంతా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ముఖ్యంగా క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. పోనీ ఖాళీగా ఉన్నాం కదా.. అని ఎవరైనా గ్రౌండ్‌లోకి బ్యాట్ పట్టుకొని పోతే.. వారితో పోలీసులు ఓ ఆట ఆడుకుంటున్నారు. దీంతో కొందరు ఇంట్లోనే క్రికెట్ ఆడుతుండగా.. మరికొందరు వారి పెరిట్లో ఫ్యామిలీ క్రికెట్ టోర్నీలు నిర్వహిస్తున్నారు.
తాజాగా ఓ వృద్ద జంట క్రికెట్‌ను ఎంజాయ్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. కేరళ రాష్ట్రంలోని పల్కడ్ జిల్లాలో టీచర్‌గా పని చేస్తున్న బిందు ఒజూకిల్ భర్త రామన్ నంబూద్రితో కలిసి తమ పెరిట్లోనే క్రికెట్ ఆడింది. వీరితో పాటు వారి పిల్లలు కూడా ఆడారు. కొబ్బరి చెట్టునే వికెట్లుగా చేసుకొని ఈ జంట ఆడిన ఆట చూడ ముచ్చటగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్ తరహాలోనే ఈ ఓల్డ్‌కపుల్.. బౌలింగ్, బ్యాటింగ్‌తో అలరించారు. దీనికి సంబంధించిన వీడియోను.. ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో 'జాయ్ ఆఫ్ క్రికెట్'అని ట్వీట్ చేయగా నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
అభిమానులు వీరి ఆటకు కామెంట్స్ రూపంలో కామెంట్రీ కూడా చెబతున్నారు. 'కష్టతరమైన్ పిచ్‌లో ఇబ్బంది కరమైన బౌన్స్'అని ఒకరు కామెంట్ చేస్తే.. 'ఆమూడో బంతి అచ్చం ప్యాట్ కమిన్స్ వేసినట్టే ఉంది'అని ఇంకొకరు.. పీటర్ హ్యాండ్స్‌కోంబ్ కన్నా అద్బుతంగా బౌలింగ్ చేస్తుందని మరొకరు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.