Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ODI World Cup 2023: ఆ తెలుగోడికి ఏం తక్కువ?

న్యూఢిల్లీ: వెస్టిండీస్ గడ్డపై పరుగుల మోత మోగిస్తున్న టీమిండియా యువ ప్లేయర్, తెలుగు తేజం తిలక్ వర్మపై మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ప్రశంసల జల్లు కురిపించాడు. నిలకడగా రాణిస్తున్న తిలక్ వర్మను వన్డేల్లో కూడా ఆడించవచ్చని అభిప్రాయపడ్డాడు. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ అందుబాటులోకి రాకుంటే తిలక్ వర్మ‌కు అవకాశం ఇవ్వాలని సూచించాడు.

వన్డేలు ఆడేందుకు అతనికి ఏం తక్కువని ప్రశ్నించాడు. వన్డే ప్రపంచకప్, ఆసియాకప్ ఆడే మెచ్యూరిటీ అతనిలో ఉందని తెలిపాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన తిలక్ వర్మ.. (39, 51, 49 నాటౌట్) వరుసగా మూడు మ్యాచ్‌ల్లో రాణించాడు. 69.50 యావరేజ్‌ 139 స్ట్రైక్‌రేట్‌తో 139 పరుగులు చేశాడు.

Wasim Jaffer

ఈ క్రమంలోనే తిలక్ వర్మ బ్యాటింగ్‌ను ప్రశంసించిన వసీం జాఫర్.. అతన్ని ఆసియాకప్‌తో పాటు ప్రపంచకప్ టోర్నీలకు పరిగణలోకి తీసుకోవాలని తెలిపాడు. 'వన్డేల్లో భారత జట్టుకు ఓ బ్యాటర్ అవసరమై.. అది తిలక్‌వర్మనే అయితే నేను ఏ మాత్రం ఆశ్చర్యపోను. అతను చూపించిన మెచ్యూరిటీ అలా ఉంది.

తిలక్ వర్మ వన్డే జట్టులోకి వస్తే నేను చాలా సంతోషిస్తాను. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఇంకా ఫిట్ అవ్వలేదనే వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరు అందుబాటులో లేనప్పుడు తిలక్ వర్మను ఎందుకు తీసుకోకూడదు? అతను బ్యాటింగ్‌లో చాలా మెచ్యూరిటీ చూపించాడు. అంతకుమించి లెఫ్ట్ హ్యాండర్ ఆప్షన్ ఇచ్చాడు. టాప్ ఆర్డర్‌లో ఆడే లెఫ్టాండర్ కోసం వెతుకుతున్నప్పుడు తిలక్ వర్మను ఎందుకు తీసుకోకూడదు.?

Tilak Varma

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో అతనిలా మరో బ్యాటర్ ఆడలేదు. నిలకడ చూపించలేదు. యువకుడైన అతను కఠిన పరిస్థితుల్లోనూ అసాధారణంగా ఆడటం ఆకట్టుకుంది. వర్షంలా వచ్చి డక్‌వర్త్ లూయిస్‌లా చర్చించుకునేట్లు చేశాడు.

క్రీజులోకి వచ్చి రావడంతోనే అటాకింగ్ గేమ్ ఆడాడు. ఎదుర్కొన్న 2-3 బంతుల్లోనే భారీ షాట్లు బాదాడు. ఇది అతను జట్టు అవసరానికి తగ్గట్లు ఎలా ట్యూన్ అయ్యాడనే విషయాన్ని తెలియజేస్తోంది. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి తన ఇన్నింగ్స్‌ను అద్భుతంగా కంట్రోల్ చేసుకున్నాడు.

మరో ఎండ్‌లో సూర్యకుమార్ యాదవ్ చెలరేగడంతో తిలక్ వర్మ తగ్గి ఆడాడు. అతను ఆడిన విధానం.. మ్యాచ్ ముగించిన తీరు అద్భుతంగా ఉంది. ఓ యువ ఆటగాడు మ్యాచ్‌ను ముగించడం అద్భుతం.'అని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Wednesday, August 9, 2023, 21:47 [IST]
Other articles published on Aug 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+