Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాపం జింబాబ్వే.. పసికూన దెబ్బకు ప్రపంచ కప్‌ రేసు నుంచి ఔట్!

బులవాయో: వన్డే ప్రపంచ కప్‌ 2023 క్వాలిఫయర్స్‌లో మరో సంచలన ఫలితం నమోదైంది. రెండుసార్లు ఛాంపియన్‌ అయిన వెస్టిండీస్‌‌కు వరల్డ్ కప్‌లో చోటు లేకుండా చేసిన పసికూన స్కాట్‌లాండ్.. ఇప్పుడు జింబాబ్వే‌కు షాకిచ్చింది. సంచలన విజయంతో భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించేందుకు అడుగు దూరంలో నిలిచింది.

మంగళవారం జరిగిన క్వాలిఫయర్స్ మ్యాచ్‌లో స్కాట్‌లాండ్ 31 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. ఈ అనూహ్య పరాజయంతో జింబాబ్వే ప్రపంచ కప్‌ రేసు నుంచి నిష్క్రమించింది. స్కాట్లాండ్ తన తదుపరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై భారీ తేడాతో ఓడిపోతేనే ఆ జట్టుకు ప్రపంచ కప్‌నకు అర్హత సాధించే అవకాశాలు దెబ్బతింటాయి.

ODI World Cup 2023 qualification: Scotland end Zimbabwes chances After 31 run win

సూపర్ సిక్స్‌లో నాలుగు మ్యాచ్‌లకు నాలుగు గెలిచిన శ్రీలంక ఇప్పటికే వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించగా.. రెండో స్థానం కోసం స్కాట్‌లాండ్ పోటీపడుతోంది. 4 మ్యాచ్‌ల్లో మూడు గెలిచిన ఆ జట్టు మెరుగైన రన్‌రేట్‌తో క్వాలిఫై అవకాశాలను మెరుగుపరుచుకుంది. మరోవైపు జింబాబ్వే ఐదు మ్యాచ్‌ల్లో మూడు మాత్రమె గెలిచింది.

రన్‌రేట్ కూడా నెగటీవ్‌గా ఉంది. అద్భుతం జరిగి నెదర్లాండ్స్ చేతిలో స్కాట్లాండ్ చిత్తుగా ఓడితే తప్పా జింబాబ్వేకు అవకాశం లేదు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 234 పరుగులు చేసింది. మైకేల్ లీస్క్ (48), మాథ్యూ క్రాస్ (38), బ్రాండన్ మెక్‌ముల్లెన్ (34), మున్సే (31) రాణించారు.

జింబాబ్వే బౌలర్లలో సీన్‌ విలియమ్స్‌ మూడు, చతార రెండు వికెట్లు తీయగా.. నగరవ ఒక వికెట్ పడగొట్టాడు. అతనంతరం లక్ష్యఛేదనకు దిగిన జింబాబ్వే 41.1 ఓవర్లలో 203 పరుగులకే ఆలౌటైంది. ర్యాన్ బర్ల్ (83), వెస్లీ మధ్వేరే (40), సికిందర్‌ రజా (34) పోరాడినా ఫలితం లేకపోయింది. స్కాట్లాండ్ బౌలర్లలో క్రిస్ సోలే మూడు, మెక్‌ముల్లెన్ , మైకేల్ లీస్క్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

క్వాలిఫయర్ టోర్నీలో సీన్ విలియమ్స్, సికిందర్ రాజా అద్భుత ప్రదర్శన కనబర్చినా.. తమ జట్టును ముందుకు తీసుకెళ్లలేకపోయారు.

Story first published: Wednesday, July 5, 2023, 8:30 [IST]
Other articles published on Jul 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+