For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ODI World Cup 2023: నవరాత్రుల ఎఫెక్ట్.. భారత్-పాక్ మ్యాచ్ రీషెడ్యూల్!

న్యూఢిల్లీ: యావత్ క్రికెట్ ప్రపంచం ఎప్పుడు ఎప్పుడా? అని ఎదురు చూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రీషెడ్యూల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుండగా.. చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్థాన్ జట్లు అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా తలపడాల్సి ఉంది. కానీ భద్రతా కారణాల రీత్యా ఈ మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఐసీసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న ఈ మ్యాచ్ జరగనుండగా.. అదే రోజు గుజరాత్ వ్యాప్తంగా నవరాత్ర ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, భారత్-పాక్ మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేయాలని గుజరాత్ పోలీస్ అధికారులు బీసీసీఐకి సూచించినట్లు ఓ జాతీయ పత్రిక తెలిపింది.

 India vs Pakistan game to be rescheduled

'మేం దీనిపై మా వద్ద ఉన్నఆప్షన్ల గురించి చర్చిస్తున్నాం. త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటాం. భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే ప్రతిష్టాత్మక మ్యాచ్ కోసం భారీ సంఖ్యలో అభిమానులు అహ్మదాబాద్‌కు తరలివస్తారు. ఓ పక్క నవరాత్రి ఉత్సవాలు, మరోవైపు మ్యాచ్‌తో తమపై భారం పెరుగుతుందని భద్రతా ఏజెన్సీలు మాకు సూచించాయి.'అని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపారు.

ఈ నేపథ్యంలోనే వరల్డ్ కప్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే రాష్ట్ర అసోసియేషన్‌లతో జూలై 27 ఢిల్లీలో బీసీసీఐ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. బీసీసీఐ సెక్రటరీ జైషా ఆధ్వర్యంలో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలోనే భారత్-పాక్ మ్యాచ్ కొత్త తేదీని నిర్ణయించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక రోజు ముందు అక్టోబర్ 14న నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే మ్యాచ్ రిషెడ్యూల్ చేస్తారన్న వార్తలతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే చాలా మంది ఈ మ్యాచ్ కోసం హోటల్స్, ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నారు. మ్యాచ్ రీ షెడ్యూల్ అయితే అభిమానులు తీవ్రంగా నష్టపోనున్నారు.ఈ నష్టాన్ని తగ్గించేందుకే మ్యాచ్‌ను ఒక రోజు ముందుకు జరపాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Story first published: Wednesday, July 26, 2023, 18:21 [IST]
Other articles published on Jul 26, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+