Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫిలిప్స్ రికార్డ్ సెంచరీ.. రెండో టీ20లో కివీస్‌ ఘన విజయం.. ఆర్సీబీ కన్ను!!

NZ vs WI: Glenn Phillips hits fastest T20I century for New Zealand

మౌంట్‌మాంగ‌నూయి: వెస్టిండీస్‌తో జ‌రిగిన రెండో టీ20లో న‌్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. విండీస్‌ను 72 ప‌రుగుల‌తో చిత్తు చేసి.. మరో మ్యాచ్ ఉండగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచులో న‌్యూజిలాండ్ బ్యాట్స్‌మ‌న్ గ్లెన్ ఫిలిప్స్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయాడు. 46 బంతుల్లోనే సెంచ‌రీ చేశాడు. న్యూజిలాండ్ త‌ర‌ఫున టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ప్లేయ‌ర్‌గా రికార్డు సృష్టించాడు. మొత్తంగా 51 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సులతో 108 రన్స్ చేశాడు.

ఫిలిప్స్ విధ్వంసం

ఫిలిప్స్ విధ్వంసం

మొద‌ట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల‌కు 238 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. మార్టిన్ గుప్టిల్ (34), టిమ్ సీఫర్ట్ (18) తొలి వికెట్‌కు 5.4 ఓవర్లలో 49 పరుగులు జోడించారు. వీరిద్దరూ 4 పరుగుల వ్యవధిలోనే ఔటైనా.. డెవాన్ కాన్వే (37 బంతుల్లో 65 నాటౌట్), గ్లెన్ ఫిలిప్స్ మూడో వికెట్‌కు ఏకంగా 184 పరుగులు జోడించారు. ఫిలిప్స్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. అలెన్ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్లో 3 సిక్సులు, ఓ ఫోర్ బాది 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఫిలిప్స్.. షెల్డన్ కాట్రెల్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో మూడు ఫోర్లు, ఓ సిక్స్ బాదాడు.

46 బంతుల్లో సెంచ‌రీ

46 బంతుల్లో సెంచ‌రీ

13, 14 ఓవర్లలోనే న్యూజిలాండ్ 48 పరుగులు పిండుకుంది. హాఫ్ సెంచరీ అనంతరం ఫిలిప్స్ మరింత చెలరేగాడు. ఫోర్లు, సిక్సులతో కివీస్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే 46 బంతుల్లో సెంచ‌రీ పూర్తిచేశాడు. కెరీర్లో 13వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడున్న ఫిలిప్స్‌కు పొట్టి ఫార్మాట్లో ఇది తొలి శతకం. అంతేకాదు న్యూజిలాండ్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. ఇక కాన్వేతో క‌లిసి మూడో వికెట్‌కు రికార్డు 184 ప‌రుగులు భాగ‌స్వామ్యం నెల‌కొల్పాడు. ధాటిగా ఆడే క్రమంలో ఫిలిప్స్ ఆఖరి ఓవర్ ఐదో బంతికి ఔటయ్యాడు.విండీస్ బౌలర్లలో థామస్, అలెన్, పోలార్డ్ తలో వికెట్ తీశారు.

పొలార్డ్ టాప్ స్కోర‌ర్

పొలార్డ్ టాప్ స్కోర‌ర్

భారీ లక్ష్య ఛేదనలో విండీస్ బ్యాట్స్‌మెన్ త‌డ‌బ‌డ్డారు. హార్డ్ హిట్ట‌ర్ల‌తో కూడిన విండీస్ లైన‌ప్‌లో ఏ ఒక్క బ్యాట్స్‌మ‌న్ కూడా క్రీజులో నిల‌దొక్కులేక‌పోయాడు. ఫ్లెచర్ (20), కింగ్ (0), హెట్మయెర్ (25), మేర్స్ (20), పూరన్ (7) నిరాశపరిచారు. చివ‌రికి 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల‌కు 166 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. కెప్టెన్ పొలార్డ్ 28 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ఈ విజ‌యంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే 2-0తో న్యూజిలాండ్‌ గెలుచుకుంది.

ఆర్సీబీ కన్ను

ఆర్సీబీ కన్ను

ఫిలిప్స్ సెంచరీ చేయగానే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆపరేషన్స్ డైరెక్టర్ మైక్ హెసన్ స్పందించాడు. గత మూడేళ్లుగా ఫిలిప్స్ బ్యాటింగ్ చూస్తున్నానని, ఈ సిరీస్‌లో అతడు విభిన్న ఆటగాడిగా కనిపిస్తున్నాడన్నాడు. ఫిలిప్స్ ఆకట్టుకున్నాడని ట్వీట్ చేశాడు. ఐపీఎల్ 2019కు ముందు జరిగిన వేలంలో ఫిలిప్స్ రూ.50 లక్షల ప్రాథమిక ధరతో వేలంలో పాల్గొన్నాడు. అయితే ఫిలిప్స్‌ను కొనుగోలు చేయడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. ఇప్పుడు సెంచరీ చేయడంతో వచ్చే సీజన్‌కు ముందు వేలంలో ఫ్రాంచైజీలు పోటీపడే అవకాశం ఉంది. అందుకే హెసన్ ట్వీట్ చేశాడు.

'బాబర్ ఆజమ్‌ పెళ్లి చేసుకుంటానని చెప్పి.. పదేళ్లు లైంగికంగా వాడుకున్నాడు!! గర్భవతిని చేశాడు'

Story first published: Sunday, November 29, 2020, 13:07 [IST]
Other articles published on Nov 29, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+