'బాబర్ ఆజమ్ పెళ్లి చేసుకుంటానని చెప్పి.. పదేళ్లు లైంగికంగా వాడుకున్నాడు!! గర్భవతిని చేశాడు'

కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్‌పై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పదేళ్లుగా బాబర్ లైంగికంగా వాడుకుంటున్నాడని, గర్భవతిని కూడా చేశాడని ఆమె పేర్కొన్నారు. బాబర్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తాను డబ్బు సాయం చేశానని కూడా ఆమె చెప్పుకొచ్చారు. శనివారం మీడియా సమావేశంలో సదరు మహిళ బాబర్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం పాక్ జట్టుతో కలిసి బాబర్ న్యూజిలాండ్‌లో ఉన్నాడు.

పెళ్లి చేసుకుంటానని చెప్పి
మీడియా సమావేశంలో సదరు మహిళ మాట్లాడుతూ... 'బాబర్ ఆజమ్, నేను స్కూల్ రోజుల నుంచి మంచి స్నేహితులం. బాబర్ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నాను. అతనికి ఆర్థికంగా కూడా సాయం చేశాను. 2010లో నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. బాబర్ నాకు ప్రపోజ్ చేశాడు. అందుకు నేను అంగీకరించాను. ఆ తర్వాతి ఏడాదే తాము పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. శారీరకంగా కూడా దగ్గరయ్యాం. చాలా చోట్లకు కలిసి వెళ్లాము' అని తెలిపారు. ఐసీసీ ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో అన్ని ఫార్మాట్లలోనూ టాప్-5లో ఉన్న ఏకైక క్రికెటర్ బాబర్ ఆజమ్ మాత్రమే.

చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు
'2012లో అండర్-19 ప్రపంచకప్‌లో పాక్ జట్టుకు బాబర్ ఆజమ్ నేతృత్వం వహించాడు. దీంతో అతనికి చాలా పేరు వచ్చింది. అనంతరం జాతీయ జట్టుకు కూడా సెలక్ట్ అయ్యాడు. ఆ తర్వాత బాబర్ తన మనసు మార్చుకున్నాడు. అప్పటినుంచి నన్ను కావాలనే దూరం పెడుతున్నాడు. ఇదే విషయమై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే.. చంపుతానని నాపై బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా నన్ను కొట్టి శారీరకంగా హింసకు గురిచేశాడు. ఇందుకు సంబంధించి అప్పట్లో బాబర్‌పై పాకిస్తాన్ క్రికెట్ బోర్టు (పీసీబీ) ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదు' అని సదరు మహిళ చెప్పుకొచ్చారు.

ఆరోపణలపై బాబార్ స్పందించలేదు
సదరు మహిళ చేసిన ఆరోపణలపై బాబార్ ఆజమ్ ఇప్పటివరకు స్పందించలేదు. అతడు ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. ఆ మహిళ చెప్పినదాంట్లో నిజమెంత అనేది పక్కనబడితే.. బాబర్‌పై చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. పేరు సంపాదించడానికి ఇలాంటి పనికిరాని ఆరోపణలు చేస్తుందని బాబర్ అభిమానులు మండిపడుతున్నారు. మహిళ చేసిన ఆరోపణలపై పాకిస్తాన్ క్రికెట్ బోర్టు (పీసీబీ) ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

అన్ని ఫార్మట్లలో కెప్టెన్‌గా
ఇటీవలే బాబర్ ఆజమ్ అన్ని ఫార్మట్లలో పాక్ క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పాక్ జట్టుతో కలిసి బాబర్ న్యూజిలాండ్‌లో ఉన్నాడు. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 18న మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. పాకిస్థాన్ క్రికెట్ జట్టులో ఏడుగురికి కరోనా పాజిటివ్ అని తేలిన సంగతి తెలిసిందే. దీంతో పాక్ క్రికెట్ జట్టులోని మిగతా ఆటగాళ్లు క్రైస్ట్‌చర్చిలోని హోటల్‌లో క్వారంటైన్లో ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
సైనీ బీమర్.. రాహుల్ పొట్టలోకి పంచ్ విసిరిన ఫించ్!! (వీడియో)