Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

NZ vs SL: శ్రీలంకపై న్యూజిలాండ్ భారీ విజయం.. పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే..?

NZ vs SL: వన్డే ప్రపంచకప్ 2023‌లో సెమీస్ చేరే నాలుగు జట్లు ఏవో దాదాపు ఖరారు అయ్యాయి. వరుసగా 8 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా.. ఆరు మ్యాచ్‌ల చొప్పున గెలిచిన సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్నాయి.

నాలుగో స్థానం కోసం న్యూజిలాండ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ పోటీపడుతున్నాయి. అయితే ఈ స్థానాన్ని న్యూజిలాండ్ దాదాపు ఖరారు చేసుకుంది. 9 మ్యాచ్‌లకు 5 గెలిచిన న్యూజిలాండ్.. మెరుగైన రన్‌రేట్‌తో సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

Sri Lankas Angelo Mathews congratulates New Zealands Glenn Phillips and Tom Latham after New Zealand win

శ్రీలంకతో గురువారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక‌ను 171 పరుగులకే ఆలౌట్ చేసిన న్యూజిలాండ్.. అనంతరం 23.2 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. దాంతో ఆ జట్టు రన్‌రేట్ అమాంతం పెరిగింది.

న్యూజిలాండ్ భారీ విజయంతో అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ సెమీస్ రేసు నుంచి దాదాపు తప్పుకున్నాయి. ఈ రెండు జట్లు తమ చివరి మ్యాచ్‌ల్లో గెలిచినా పేలవ రన్‌రేట్ కారణంగా ఇంటిబాట పట్టనున్నాయి. ఇంగ్లండ్‌తో జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేస్తే 277 పరుగుల భారీ తేడాతో గెలవాలి.

NZ vs SL: Semifinal scenario for Pakistan After New Zealand beat Sri Lanka

ముందుగా బౌలింగ్ చేస్తే మాత్రం ఇంగ్లండ్‌ను 50 పరుగులకు ఆలౌట్ చేసి 2.3 ఓవర్లలో చేధించాలి. ఏ లెక్కన చూసుకున్నా.. ఇది అసాధ్యం. మాజీ ఛాంపియన్ ఇంగ్లండ్‌ ఈ టోర్నీలో విఫలమైనా.. నెదర్లాండ్స్‌పై సాధించిన భారీ విజయంతో ఆ జట్టు ఫామ్‌లోకి వచ్చింది. పాకిస్థాన్ తలకిందులు తపస్సు చేసినా.. సెమీస్ చేరలేదు.

NZ vs SL: Semifinal scenario for Pakistan After New Zealand beat Sri Lanka

నవంబర్ 15న ముంబై వేదికగా జరిగే తొలి సెమీఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. 16న కోల్‌కతా వేదికగా జరిగే రెండో సెమీఫైనల్లో సౌతాఫ్రికా, ఆసీస్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.

Story first published: Thursday, November 9, 2023, 20:23 [IST]
Other articles published on Nov 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+