Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

NZ vs SL: కేన్ మామ క్రేజీ ఇన్నింగ్స్.. టెస్ట్‌ల్లో కూడా లాస్ట్ బాల్‌కు గెలిచిన కివీస్!(వీడియో)

NZ vs SL: New Zealand wins win by three inches in Another last-ball nailbiter vs Sri Lanka

క్రైస్ట్ చర్చ్: సొంతగడ్డపై న్యూజిలాండ్ జోరు కొనసాగుతోంది. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌లో ఒక్క పరుగుతో గెలిచిన న్యూజిలాండ్.. తాజాగా శ్రీలంకతో తొలి టెస్ట్‌లో ఆఖరి బంతికి విజయాన్నందుకుంది. ఆసాంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్(194 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 121) సెంచరీతో చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఆఖరి బంతికి విజయాన్నందుకోవడం తరుచుగా చూస్తుంటాం. కానీ సంప్రదాయక ఫార్మాట్ అయిన టెస్ట్‌ల్లో చివరి బంతికి విజయం సాధించడం అత్యంత అరుదు. అలాంటి థ్రిల్లింగ్ విక్టరీని న్యూజిలాండ్ నమోదు చేసింది. అసలు సిసలు టెస్ట్ ఫార్మాట్ మజాను అభిమానులకు అందజేసింది.

కేన్‌ మామ సూపర్ సెంచరీ..

285 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 70 ఓవర్లలో 8 వికెట్లకు సరిగ్గా 285 పరుగులే చేసి గెలుపొందింది. కేన్ విలియమ్సన్‌కు తోడుగా డారిల్ మిచెల్(86 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 81) హాఫ్ సెంచరీతో రాణించాడు. శ్రీలంక బౌలర్లలో అసితా ఫెర్నాండో మూడు వికెట్లు తీయగా.. ప్రబాత్ జయసూర్య రెండు వికెట్లు పడగొట్టాడు. కాసున్ రజితా, లాహిరు కుమారా తలో వికెట్ తీసారు.

వర్షం అంతరాయంతో..

28/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో చివరి రోజు ఆటను కొనసాగించిన న్యూజిలాండ్‌ను కేన్ మామ ఆదుకున్నాడు. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించడంతో చివరి రోజు 70 ఓవర్ల ఆటనే సాధ్యమైంది. ఓవైపు వికెట్లు పడుతాన్నా.. మరోవైపు కేన్ విలియమ్సన్ జట్టును విజయం దిశగా నడిపించాడు. ఈ మ్యాచ్ చివరి ఓవర్‌లో కివీస్ విజయానికి 8 పరుగులు అవసరమవ్వగా.. తొలి రెండు బంతులకు రెండే పరుగులొచ్చాయి. మూడో బంతికి మ్యాట్ హెన్రీ రనౌటవ్వగా.. ఓ పరుగు వచ్చింది. మరుసటి బంతిని కేన్ విలియమ్సన్‌ను బౌండరీ బాదగా..స్కోర్లు టై అయ్యాయి.

ఆఖరి బంతికి పరుగు తీసి..

ఐదో బంతి డాట్ కావడంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. చివరి బంతి కూడా కేన్ విలియమ్సన్ బ్యాట్ మిస్సవ్వగా.. కివీస్ బ్యాటర్లు పరుగు తీసారు. కీపర్.. బౌలర్ వైపు బంతి విసిరేయగా.. కేన్ మామ సూపర్ డైవ్‌తో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో పాటు విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కామెంటేటర్లు అయితే వరల్డ్ కప్ గెలిచిన రీతిలో తమ వ్యాఖ్యానంతో అదరగొట్టారు.

థ్యాంక్యూ కేన్ మామ..

థ్యాంక్యూ కేన్ మామ..

అసాధారణ బ్యాటింగ్‌తో కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన కేన్ విలియమ్సన్‌‌కు భారత అభిమానులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. న్యూజిలాండ్ విజయంతో టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. దాంతో కేన్ మామకు థ్యాంక్స్ చెబుతున్నారు. ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌లోనూ కేన్ విలియమ్సన్(132) సెంచరీతో విజయంలో కీలక పాత్ర పోషించాడని గుర్తు చేస్తున్నారు.

Story first published: Monday, March 13, 2023, 15:37 [IST]
Other articles published on Mar 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+