Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

NZ vs SL: శ్రీలంకపై న్యూజిలాండ్ ఘన విజయం.. పాక్ సెమీస్ ఆశలు సంక్లిష్టం!

NZ vs SL: వన్డే ప్రపంచకప్ 2023లో సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ అద్భుతం చేసింది. శ్రీలంకతో గురువారం జరిగిన కీలక మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో సెమీస్‌ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది.

పాకిస్థాన్ లేదా అఫ్గానిస్థాన్ అసాధారణ విజయాలు సాధిస్తే తప్పా.. కివీస్ సెమీస్ బెర్త్‌కు వచ్చే డోకా లేదు. అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ కంటే న్యూజిలాండ్‌కు మెరుగైన రన్‌రేట్ ఉంది. ఇంగ్లండ్‌తో జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ భారీ విజయం సాధిస్తేనే ఆ జట్టుకు సెమీస్ బెర్త్‌ దక్కుతుంది.

NZ vs SL: New Zealand inch closer to semifinals with 5-wicket win over Lanka

శ్రీలంకతో మ్యాచ్‌లో 23.2 ఓవర్లలోనే న్యూజిలాండ్ విజయం సాధించడంతో పాకిస్థాన్ విజయసమీకరణాలు అసాధారణంగా మారాయి.277 పరుగుల భారీ తేడాతో ఆ జట్టు గెలవాల్సి ఉంది. ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ చేస్తే మాత్రం పాకిస్థాన్‌కు ఛాన్స్ లేదు. ఇది ఏ లెక్కన చూసుకున్న అసాధ్యం.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 46.4 ఓవర్లలో 171 పరుగులకు కుప్పకూలింది. శ్రీలంక బ్యాటర్లలో కుశాల్ పెరీరా(28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీతో రాణించగా.. చివర్లో మహీశ్ తీక్షణ(38 నాటౌట్), దిల్షన్ మధుషంక(19 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్(3/37), లాకీ ఫెర్గూసన్(2/35), మిచెల్ సాంట్నర్(2/22), రచిన్ రవీంద్ర(2/21) నిప్పులు చెరిగారు.

NZ vs SL: New Zealand inch closer to semifinals with 5-wicket win over Lanka

అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ 23.2 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు డెవాన్ కాన్వే(42 బంతుల్లో 9 ఫోర్లతో 45), రచిన్ రవీంద్ర(34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42), డారిల్ మిచెల్(31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) రాణించారు. గ్లేన్ ఫిలిప్స్(10 బంతుల్లో 3 ఫోర్లతో 17 నాటౌట్) ధాటిగా ఆడాడు. శ్రీలంక బౌలర్లలో ఏంజెలో మాథ్యూస్(2/29) రెండు వికెట్లు తీయగా.. మహీష తీక్షణ, చమీరా తలో వికెట్ పడగొట్టారు.

Story first published: Thursday, November 9, 2023, 20:03 [IST]
Other articles published on Nov 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+