Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

NZ vs SL: హ్యాట్రిక్‌తో చరిత్ర సృష్టించిన తీక్షణ!

శ్రీలంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్‌లో హ్యాట్రిక్ వికెట్ సాధించిన ఏడో శ్రీలంక బౌలర్‌గా రికార్డ్ సాధించాడు. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం హామిల్టన్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో తీక్షణ ఈ ఫీట్ సాధించాడు. వర్షం అంతరాయం కలిగిన ఈ మ్యాచ్‌లో తీక్షణ రెండు ఓవర్ల సాయంతో హ్యాట్రిక్ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు.

వరుసగా మూడు బంతుల్లో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ స్టార్క్, నాథన్ స్మిత్, మ్యాట్ హెన్రీలను ఔట్ చేశాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ 35వ ఓవర్ చివరి రెండు బంతులకు మిచెల్ సాంట్నర్, నాథన్ స్మిత్‌లను ఔట్ చేసిన తీక్షణ.. 37వ ఓవర్ తొలి బంతికి మ్యాట్ హెన్రీని పెవిలియన్ చేర్చి హ్యాట్రిక్ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు.

NZ vs SL Maheesh Theekshana Creates History Becomes 7th Sri Lankan Bowler To Claim Hattrick In ODIs

తీక్షణ కంటే ముందు శ్రీలంక తరఫున చమింద వాస్(2001, 2003),లసిత్ మలింగా(2007), ఫర్వేజ్ మహరూఫ్(2007), లసిత్ మలింగా(2011), తిసారా పెరెరా(2012), వానిందు హసరంగా(2017), దుష్మంత్ మధుషంక(2018)లు వన్డే క్రికెట్‌లో హ్యాట్రిక్ సాధించారు.

ఈ మ్యాచ్‌లో మొత్తం 8 ఓవర్లు బౌలింగ్ చేసిన తీక్షణ 44 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. తీక్షణ హ్యాట్రిక్ తీసిన ఈ మ్యాచ్‌లో శ్రీలంకకు పరాజయం తప్పలేదు. 113 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది.

37 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 9 వికెట్లకు 255 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర(63 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 79), మార్క్ ఛాప్‌మన్(52 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62) హాఫ్ సెంచరీలతో రాణించారు.
అనంతరం శ్రీలంక 30.2 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటైంది. కామిందు మెండిస్(66 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 64) హాఫ్ సెంచరీతో రాణించాడు.

Story first published: Wednesday, January 8, 2025, 17:53 [IST]
Other articles published on Jan 8, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+