For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

NZ vs SL: కేన్ మామ, హెన్రీ నికోల్స్ డబుల్.. శ్రీలంక ట్రబుల్!

NZ vs SL: Kane Williamson hits 6th Test double hundred in 2nd test vs Sri Lanka, equals Sachin, Sehwag

వెల్లింగ్టన్: సొంతగడ్డపై శ్రీలంకతో జరుగుతున్న రెండు టెస్ట్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ తన జోరును కొనసాగిస్తోంది. తొలి టెస్ట్‌లో ఆఖరి బంతికి గెలిచిన కివీస్.. రెండో టెస్ట్‌లోనూ భారీ స్కోర్ నమోదు చేసింది. మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్(296 బంతుల్లో 23 ఫోర్లు, 2 సిక్స్‌లతో 215), హెన్రీ నికోల్స్(240 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్‌లతో 200 నాటౌట్) డబుల్ సెంచరీలతో చెలరేగడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌ను 580/4 స్కోర్ వద్ద డిక్లేర్ ఇచ్చింది.

ఈ ఇద్దరికి తోడుగా ఓపెనర్ డెవాన్ కాన్వే(108 బంతుల్లో 13 ఫోర్లతో 78) హాఫ్ సెంచరీతో రాణించాడు. శ్రీలంక బౌలర్లలో కసున్ రజితా రెండు వికెట్లు తీయగా.. ధనుంజయ డిసిల్వా, ప్రబత్ జయసూర్య తలో వికెట్ పడగొట్టారు.

NZ vs SL: Kane Williamson hits 6th Test double hundred in 2nd test vs Sri Lanka, equals Sachin, Sehwag

డబుల్ సెంచరీతో కేన్ మామ ( Kane Williamson) అరుదైన రికార్డును దక్కించుకున్నాడు. కెరీర్‌లో 6వ డబుల్ సెంచరీ నమోదు చేసిన కేన్.. అత్యధిక డబుల్ సెంచరీలు బాదిన జాబితాలో దిగ్గజాల సరసన నిలిచాడు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌, మార్వన్ ఆటపట్టు, జావెద్ మియాందాద్‌, యూనిస్ ఖాన్‌, రికీ పాంటింగ్‌ల రికార్డును కేన్ మామ సమం చేశాడు. అత్యధిక డబుల్ సెంచరీల జాబితాలో డాన్ బ్రాడ్‌మన్ 12 డబుల్ సెంచరీలతో టాప్‌లో ఉన్నాడు. అతను 52 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు.

వర్షం అంతరాయం కారణంగా తొలి రోజు 48 ఓవర్ల ఆటే సాధ్యమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మొదటి రోజు 2 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఈ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన న్యూజిలాండ్.. నిలకడగా బ్యాటింగ్ చేసింది. కేన్ విలియమ్సన్, నికోల్స్ లంక బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచారు. ముందుగా కేన్ మామ 106 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. నికోల్స్ 79 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. హాఫ్ సెంచరీ అనంతరం కాస్త ధాటిగా ఆడిన కేన్ మామ.. 171 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోగా.. న్యూజిలాండ్ 304/2 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

NZ vs SL: Kane Williamson hits 6th Test double hundred in 2nd test vs Sri Lanka, equals Sachin, Sehwag

అనంతరం మరింత వేగంగా ఆడిన కేన్ మామ 231 బంతుల్లో 150 పరుగుల మార్క్ అందుకున్నాడు. మరోవైపు అతనికి అండగా నిలిచిన హెన్రీ నికోల్స్ (Henry Nicholls)..173 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో కివీస్ 443/2 స్కోర్‌తో టీ బ్రేక్‌కు వెళ్లింది. మూడో సెషన్ ఆరంభంలోనే కేన్ మామ 285 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. ఆ కొద్దిసేపటికే అతను ఔటవ్వగా.. మూడో వికెట్‌కు నమోదైన 363 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం హెన్రీ నికోల్స్ డబుల్ సెంచరీ పూర్తి చేసుకోవడం.. డారిల్ మిచెల్ ఔటవ్వడం.. 20 ఓవర్ల ఆటే మిగిలి ఉండటంతో న్యూజిలాండ్ డిక్లేర్ ఇచ్చింది.

Story first published: Saturday, March 18, 2023, 10:23 [IST]
Other articles published on Mar 18, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+