Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

NZ vs SL: క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూ.. సిగ్గుతో తలదించుకున్న కేన్ మామ!(వీడియో)

NZ vs SL: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా జరుగుతున్న న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూను న్యూజిలాండ్ టీమ్ కోరింది. శ్రీలంక ఇన్నింగ్స్ 24వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్ మూడో బంతికి చమిక కరుణరత్నే(6) కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేరాడు. అనంతరం దుష్మంత్ చమీరా క్రీజులోకి రాగా.. ఫెర్గూసన్ ఫుల్‌టాస్ వేసాడు.

ఈ బంతిని అంచనా వేయడంలో చమీరా విఫలమవడంతో ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకొని ప్యాడ్‌కు తాకింది. దాంతో న్యూజిలాండ్ ఆటగాళ్లు అప్పీల్ చేశారు. అంపైర్ నాటౌటివ్వగా.. ఫస్ట్ స్లిప్‌లో ఉన్న డారిల్ మిచెల్ రివ్యూ తీసుకోవాలని పట్టుబట్టాడు. దాంతో కేన్ విలియమ్సన్ రివ్యూ కోరగా.. రీప్లేలో బంతి బ్యాట్‌ను తాకడం స్పష్టంగా కనిపించింది. ఇది చూసి కివీస్ ప్లేయర్లు నవ్వుకున్నారు. కేన్ విలియమ్సన్ అయితే సిగ్గుతో తలదించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

NZ vs SL: Kane Williamson Covering His Face While Laughing After Worst DRS Of World Cup goes viral

ఐసీసీ ఏకంగా రివ్యూ ఆఫ్ ది టోర్నీ అనే క్యాప్షన్‌తో ఈ వీడియో షేర్ చేసింది. ఈ వికెట్‌ను ఎలా సవాల్ చేయాలనిపించింది కేన్ మామ అంటూ ఫ్యాన్స్ సెటైర్లు పేల్చుతున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 46.4 ఓవర్లలో 171 పరుగులకు కుప్పకూలింది. శ్రీలంక బ్యాటర్లలో కుశాల్ పెరీరా(28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీతో రాణించగా.. చివర్లో మహీశ్ తీక్షణ(38 నాటౌట్), దిల్షన్ మధుషంక(19 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్(3/37), లాకీ ఫెర్గూసన్(2/35), మిచెల్ సాంట్నర్(2/22), రచిన్ రవీంద్ర(2/21) నిప్పులు చెరిగారు.

స్వల్ప లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ విజయం దిశగా దూసుకెళ్తోంది. 14 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లకు 92 పరుగులు చేసింది. ఓపెనర్లు డెవాన్ కాన్వే(45), రచిన్ రవీంద్ర(42) ఔటవ్వగా.. కేన్ విలియమ్సన్(1), డారిల్ మిచెల్(0) క్రీజులో ఉన్నారు.

Story first published: Thursday, November 9, 2023, 19:13 [IST]
Other articles published on Nov 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+