Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

NZ vs SA:చరిత్ర సృష్టించిన రచిన్ రవీంద్ర.. 25 ఏళ్ల తర్వాత..!

సొంతగడ్డపై సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్ పట్టు బిగించింది. యువ ప్లేయర్ రచిన్ రవీంద్ర(366 బంతుల్లో 26 ఫోర్లు, 3 సిక్స్‌లతో 240) డబుల్ సెంచరీతో చెలరేగడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో144 ఓవర్లలో 511 పరుగుల భారీ స్కోర్ చేసింది. రచిన్ రవీంద్రతో పాటు కేన్ విలియమ్సన్(289 బంతుల్లో 16 ఫోర్లతో 118) సెంచరీతో రాణించాడు.

సౌతాఫ్రికా బౌలర్లలో నీల్ బ్రాండ్(6/1119) ఆరు వికెట్లు తీయగా.. రాన్ డీ స్వార్డ్స్ రెండు వికెట్లు పడగొట్టాడు. డేన్ పీటర్సన్, మోర్కీ తలో వికెట్ తీసారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా రెండో రోజు ఆట ముగిసే సరికి 28 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. క్రీజులో డేవిడ్ బెడింగ్‌హమ్(29 బ్యాటింగ్), కీగన్ పీటర్సన్(2 బ్యాటింగ్) ఉన్నారు.

NZ vs SA: Rachin Ravindra enters history books after converting maiden Test ton into double century

న్యూజిలాండ్ బౌలర్లలో కైల్ జెమీసన్ రెండు వికెట్లు తీయగా.. టీమ్ సౌథీ, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ తీసారు. మూడో రోజు ఆటలో సౌతాఫ్రికాను త్వరగా ఆలౌట్ చేస్తే కివీస్ ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తేడాతో గెలిచే అవకాశం ఉంటుంది.

25 ఏళ్ల తర్వాత:
కెరీర్‌లో తొలి సెంచరీని డబుల్ సెంచరీగా మార్చిన రచిన్ రవీంద్ర సరికొత్త రికార్డు సృష్టించాడు. 25 ఏళ్ల తర్వాత ఈ ఘనతను అందుకున్న న్యూజిలాండ్ క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. 1999లో మాథ్యూ సింక్లెయిర్ 214 పరుగులు చేసి తన తొలి శతకాన్ని డబుల్ సెంచరీగా మార్చాడు. ఇక న్యూజిలాండ్ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన ప్లేయర్‌గానూ రచిన్ రవీంద్ర గుర్తింపు పొందాడు.

కేన్ మామ ఔటైనా..:
258/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన న్యూజిలాండ్.. ఆదిలోనే కేన్ విలియమ్సన్ వికెట్ కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన డాలిమ్ మిచెల్(34), గ్లేన్ ఫిలిప్స్ సాయతో రచిన్ రవీంద్ర డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో కివీస్ 500 పరుగుల మార్క్‌ను అందుకుంది.

టామ్ బ్లండెల్(11), మిచెల్ సాంట్నర్(2), టీమ్ సౌథీ(0) తీవ్రంగా నిరశపరచగా.. కైల్ జెమీస్(8 నాటౌట్) అజేయంగా నిలిచాడు. డారిల్ మిచెల్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 103 పరుగులు జోడించిన రచిన్.. గ్లేన్ ఫిలిప్స్‌తో ఆరో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యం అందించాడు. ఏడో వికెట్‌గా రచిన్ రవీంద్ర వెనుదిరగ్గా.. మ్యాట్ హెన్రీ(27) సూపర్ బ్యాటింగ్‌తో కివీస్ 500 పరుగుల మార్క్‌ను అందుకుంది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు కైల్ జెమీస్ ఆదిలోనే గట్టి షాకిచ్చాడు. ఓపెనర్ నీల్ బ్రాండ్(4)ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే వాన్ టోండర్(0) డకౌటవ్వగా.. ఎడ్వర్డ్ మోర్(23)ను హెన్రీ పెవిలియన్ చేర్చాడు. కాస్త నిలకడగా ఆడే ప్రయత్నం చేసిన జుబైర్ హంజా(22)ను సాంట్నర్ క్లీన్ బౌల్డ్ చేశాడు.

Story first published: Monday, February 5, 2024, 17:24 [IST]
Other articles published on Feb 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+