Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

NZ vs SA: కేన్ మామ సెంచరీ.. కోహ్లీ రికార్డ్ బ్రేక్!

న్యూజిలాండ్‌ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ తరం ఆటగాళ్లలో అత్యధిక టెస్ట్‌ సెంచరీలు నమోదు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించాడు. సొంతగడ్డపై సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో కేన్ విలియమ్సన్(259 బంతుల్లో 15 ఫోర్లతో 112 నాటౌట్) సెంచరీ సాధించాడు.

టెస్ట్ కెరీర్‌లో అతనికి ఇది 30వ శతకం. ఈ తరం ఆటగాళ్లలో 32 టెస్ట్ శతకాలతో స్టీవ్ స్మిత్ అగ్రస్థానంలో ఉండగా.. 30 సెంచరీలతో కేన్ విలియమ్సన్, జోరూట్‌తో కలిసి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ 29 శతకాలతో మూడో స్థానంలో ఉన్నాడు. మూడు ఫార్మాట్లలో 80 శతకాలతో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా.. డేవిడ్ వార్న్(49), రోహిత్ శర్మ(46), జోరూట్(46), స్టీవ్ స్మిత్(44), కేన్ విలియమ్సన్(43) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

NZ vs SA: Kane Williamson goes past Don Bradman and Virat in all-time list with 30th Test hundred

కేన్ విలియమ్సన్‌తో పాటు రచిన్ రవీంద్ర(211 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌తో 118) సెంచరీతో చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 86 ఓవర్లలో 2 వికెట్లకు 258 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో మోర్కీ, పాటెర్సన్ తలో వికెట్ తీసారు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే డేవాన్ కాన్వే(1), టామ్ లాథమ్(20) వికెట్లను కోల్పోయింది. దాంతో కివీస్ 39 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ జట్టును ఆదుకున్నారు. మూడో వికెట్‌కు అజేయంగా 221 పరుగులు జోడించారు.

NZ vs SA: Kane Williamson goes past Don Bradman and Virat in all-time list with 30th Test hundred

241 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న కేన్ విలియమ్సన్.. 97 మ్యాచ్‌ల్లో 55.03 సగటుతో 30 సెంచరీ మార్క్ అందుకున్నాడు. గత 9 ఇన్నింగ్స్‌ల్లో కేన్ మామ 5 శతకాలు నమోదు చేశాడు.

Story first published: Sunday, February 4, 2024, 11:49 [IST]
Other articles published on Feb 4, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+