For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

NZ vs SA: 29 ఓవర్లు మెయిడిన్!

సొంతగడ్డపై సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్ బౌలర్లు నిప్పులు చెరిగారు. కట్టుదిట్టమైన బంతులతో సౌతాఫ్రికా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. 89 ఓవర్ల పాటు సాగిన తొలి రోజు ఆటలో కివీస్ బౌలర్లు ఏకంగా 29 ఓవర్లు మెయిడిన్ చేశారు. ఈ మధ్య కాలంలో టెస్ట్ మ్యాచ్‌ తొలి రోజు ఆటలో ఇన్ని ఓవర్లు మెయిడిన్ అవ్వడం ఇదే తొలిసారి. న్యూజిలాండ్ బౌలర్ల అద్భుత ప్రదర్శనతో తొలి రోజు ఆటలో ఆ జట్టు పూర్తి ఆధిపత్యం చెలాయించింది.

మంగళవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 89 ఓవర్లలో 6 వికెట్లకు 220 పరుగులు చేసింది. రువాన్ డి స్వర్డ్(135 బంతుల్లో 9 ఫోర్లతో 55 బ్యాటింగ్), షాన్ వాన్ బెర్గ్(82 బంతుల్లో 6 ఫోర్లతో 34 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో రచిన్ రవీంద్ర(3/33) మూడు వికెట్లు తీయగా.. నీల్ వాగ్నర్, విలియమ్, మ్యాట్ హెన్రీ తలో వికెట్ తీసారు.

NZ vs SA 2nd Test: New Zealand dominate with 29 maidens on Day 1 as Proteas battle to survive

21 ఓవర్లు బౌలింగ్ చేసిన రచిన్ రవీంద్ర 8 ఓవర్లు మెయిడిన్ చేశాడు. టీమ్ సౌథీ 7, మ్యాట్ హెన్రీ, 5, విలియమ్ 3, నీల్ వాగ్నర్ 6 ఓవర్లు మెయిడిన్ చేశారు. కివీస్ బౌలర్ల కట్టుదిట్టమైన బంతులకు సఫారీ బ్యాటర్లు డిఫెన్స్‌కే పరిమితమయ్యారు.

ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో ఓపెనర్ క్లైడ్ ఫర్చ్యూన్(0) గోల్డెన్ డక్‌గా హెన్రీ పెవిలియన్ చేర్చగా.. మరో ఓపెనర్ నీల్ బ్రాండ్, రేనార్డ్ వాన్ టోండర్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితమైన ఈ జోడీని విలియమ్ విడదీసాడు. నీల్ బ్రాండ్‌(25) ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే రెనార్డ్(32) కూడా ఔటవ్వడంతో.. జుబైర్ హమ్‌జా, డెవిడ్ బెడింగ్‌హమ్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ రచిన్ రవీంద్ర దెబ్బతీసాడు.

జుబైర్(20), డేవిడ్(39)లను వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేర్చాడు. ఆ కొద్ది సేపటికే కీగన్ పీటర్సన్(2)ను కూడా ఔట్ చేయడంతో 150 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి సౌతాఫ్రికా కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో రువాన్ డి స్వర్డ్(135 బంతుల్లో 9 ఫోర్లతో 55 బ్యాటింగ్), షాన్ వాన్ బెర్గ్(82 బంతుల్లో 6 ఫోర్లతో 34 బ్యాటింగ్) మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడి తొలి రోజు ఆటను ముగించారు.

Story first published: Tuesday, February 13, 2024, 12:45 [IST]
Other articles published on Feb 13, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+