
అబుదాబి: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ తమ జోరును కొనసాగిస్తుంది. ఇప్పటికే భారత్‌పై చారిత్రాత్మక విజయాన్నందుకున్న ఆ జట్టు న్యూజిలాండ్‌తో అబుదాబి వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లోనూ బౌలింగ్‌లో అదరగొట్టింది. తమ పెర్ఫామెన్స్‌కు పిసరంత అదృష్టం కూడా తోడవుతుండటంతో చెలరేగుతుంది. మళ్లీ టాస్ గెలిచిన ఆ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా.. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. పాక్ ముందు 135 పరుగుల స్వల్ప లక్ష్యాన్నే ఉంచింది. పిచ్ నుంచి లభించిన సహకారంతో పాక్ బౌలర్లు చెలరేగడంతో న్యూజిలాండ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది.
దాంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 134 పరుగులే చేసింది. మిచెల్ ( 20 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లతో 27), డెవాన్ కాన్వే (24 బంతుల్లో 3 ఫోర్లతో ), కేన్ విలియమ్సన్ (26 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ 25) టాప్ స్కోరర్లుగా నిలిచారు. పాకిస్థాన్ బౌలర్లలో రవూఫ్(4/22) నాలుగు వికెట్లతో న్యూజిలాండ్ పతనాన్ని శాసించగా.. హాఫీజ్, ఇమాద్ వసీమ్, షాహీన్ ఆఫ్రిది తలో వికెట్ పడగొట్టారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు మార్టిన్ గప్తిల్ (17 ), మిచెల్(27) నిధానంగా ఆడినప్పటికీ శుభారంభం అందించారు. దాంతో కివీస్ ఐదో ఓవర్లకు 36/0తో నిలిచింది. రవూఫ్ వేసిన ఆరో ఓవర్‌లో గప్తిల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇమాద్ వసీమ్ వేసిన తొమ్మిదో ఓవర్‌లో మిచెల్.. ఫకార్ జమాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జిమ్మీ నీషమ్ (1) తీవ్రంగా నిరాశపరిచాడు. దాంతో కివీస్ 56 పరుగులకే కీలక మూడు వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్, డేవాన్ కాన్వే ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. తొలుత నిదానంగా ఆడిన ఈ జోడీ ఆ తర్వాత జోరుగా ఆడే ప్రయత్నం చేసింది. మహమ్మద్ హాఫీజ్ వేసిన 12 ఓవర్లో విలియమ్సన్ వరుసగా ఓ ఫోర్, సిక్సర్ బాదాడు. సింగిల్ హ్యాండ్‌తో బంతిని స్టాండ్‌లోకి పంపించాడు.
షాదాబ్ ఖాన్ వేసిన ఆ మరుసటి ఓవర్లో కాన్వే వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. అయితే క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని హసన్ అలీ తన సూపర్ త్రోతో విడదీశాడు. కేన్ విలియమ్సన్‌ను రనౌట్‌గా పెవిలియన్ చేర్చి కివీస్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. గ్లేన్ ఫిలిప్స్(13) క్రీజులోకి రాగా.. కాన్వే స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. అయితే రవూఫ్ వేసిన18 ఓవర్‌లో కాన్వే, ఫిలిప్స్ (13) పెవిలియన్ చేరడంతో కివీస్ భారీ స్కోర్‌కు గండిపడింది. చివర్లో సీఫర్ట్ (8), శాంటర్న్ (6) బౌల్డ్ అవ్వడంతో న్యూజిలాండ్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది.
ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 9 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్ల నష్టానికి 47 రన్స్ మాత్రమే చేసింది. క్రీజులో ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్(24 బ్యాటింగ్)తో పాటు మహమ్మద్ హఫీజ్ ఉన్నారు. బాబర్ ఆజామ్(9).. టీమ్ సౌథీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్ట్ కాగా.. ఫకార్ జమాన్ సోదీ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు.