NZ vs PAK T20 World Cup: న్యూజిలాండ్‌పై పగ తీర్చుకున్న పాక్! కేన్ మామది కోహ్లీ పరిస్థితే!

అబుదాబి: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జోరును కొనసాగుతోంది. అర్థంతరంగా పర్యటనను రద్దు చేసుకొని తమ దేశ క్రికెట్ భవిష్యత్తుపైన దెబ్బకొట్టిన న్యూజిలాండ్‌పై పగతో రగిలిపోతున్న పాకిస్థాన్ పర్‌ఫెక్ట్ రివేంజ్ తీసుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా చెలరేగి 5 వికెట్లతో కివీస్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో నాకౌట్ అవకాశాలను మరింత సులువు చేసుకుంది. గ్రూప్2లో మిగిలిన అఫ్గానిస్థాన్, నమీబియా, స్కాట్లాండ్ మ్యాచ్‌లతో రెండు గెలిచినా పాక్ సెమీస్ చేరుకుంటుంది. మరోవైపు ఓటమితో న్యూజిలాండ్ తమ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. టోర్నీలో ముందుకు సాగాలంటే ప్రతీ మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది.

చెలరేగిన మాలిక్, అసిఫ్ అలీ..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 134 పరుగులే చేసింది. మిచెల్ ( 20 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లతో 27), డెవాన్ కాన్వే (24 బంతుల్లో 3 ఫోర్లతో ), కేన్ విలియమ్సన్ (26 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ 25) టాప్ స్కోరర్లుగా నిలిచారు. పాకిస్థాన్ బౌలర్లలో రవూఫ్(4/22) నాలుగు వికెట్లతో న్యూజిలాండ్ పతనాన్ని శాసించగా.. హాఫీజ్, ఇమాద్ వసీమ్, షాహీన్ ఆఫ్రిది తలో వికెట్ పడగొట్టారు. అనంతరం పాకిస్థాన్.. 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 135 రన్స్ చేసింది. ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్(34 బంతుల్లో 5 ఫోర్లతో 33) తన ఫామ్ కొనసాగించగా.. సీనియర్ ప్లేయర్ షోయబ్ మాలిక్(20 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 26 నాటౌట్), అసిఫ్ అలీ(12 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 27 నాటౌట్) మెరుపులు మెరిపించారు. న్యూజిలాండ్ బౌలర్లలో ఇష్ సోదీ రెండు వికెట్లు తీయగా.. సాంట్నర్, సౌథీ, ట్రెంట్ బౌల్ట్ తలో వికెట్ పడగొట్టారు.

ఆరంభంలో తడబడినా..
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. టీమ్ సౌథీ బౌలింగ్‌లో కెప్టెన్ బాబర్ ఆజామ్(9) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే మరో ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ అడపా దడపా బౌండరీలు బాదడంతో పవర్ ప్లేలో పాక్ వికెట్ నష్టానికి 30 పరుగులు మాత్రమే చేసింది. క్రీజులోకి వచ్చిన ఫకార్ జమాన్.. సోదీ వేసిన 9వ ఓవర్‌లో సిక్స్‌తో టచ్‌లోకి వచ్చినట్లు కనిపించినా.. ఆ ఓవర్ చివరిబంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. అంపైర్ నాటౌట్ ఇవ్వగా న్యూజిలాండ్ రివ్యూకెళ్లి ఫలితం సాధించింది. అనంతరం క్రీజులోకి వచ్చిన మహమ్మద్ హఫీజ్ భారీ సిక్సర్‌తో తన రాకను ఘనంగా చాటుకున్నాడు. అయితే అతన్ని సాంట్నర్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.

సూపర్ ఫినీష్..
సోదీ వేసిన ఆ మరుసటి ఓవర్‌లోనే రిజ్వాన్ ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులోకి షోయబ్ మాలిక్ రాగా.. స్కోర్ బోర్డు వేగం మందగించింది. అయితే బౌల్ట్ బౌలింగ్‌లో ఫోర్‌తో ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన ఇమాద్ వసీం (11) ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన అసిఫ్ అలీ బౌండరీ బాదగా.. మరుసటి ఓవర్‌లో మాలిక్ మరో బౌండరీ బాది స్కోర్ బోర్డును పరుగెత్తించే ప్రయత్నం చేశాడు. ఇక సౌథీ వేసిన 17వ ఓవర్‌లో మాలిక్ వరుస సిక్స్‌లతో చెలరేగాడు. దాంతో పాకిస్థాన్ విజయానికి 18 బంతుల్లో 24 రన్స్ అవసరమయ్యాయి. సాంట్నర్ వేసిన 18వ ఓవర్‌లో మాలిక్ ఫోర్ సిక్స్ బాదగా.. బౌల్ట్ వేసిన 19వ ఓవర్‌లో సిక్స్, క్విక్ డబుల్‌తో అసిఫ్ అలీ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications