Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ తప్పిదమే మా కొంపముంచింది: షాహిన్ అఫ్రిది

బౌలింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని పాకిస్థాన్ కెప్టెన్ షాహిన్ అఫ్రిది తెలిపాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన రెండో టీ20లో పాకిస్థాన్ 21 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ పరాజయంతో ఈ సిరీస్‌లో 0-2తో పాక్ వెనుకంజలో నిలిచింది.

ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన షాహిన్ అఫ్రిది.. ఆరంభంలో మెరుగ్గా బౌలింగ్ చేసుంటే ఫలితం మరోలా ఉండేదని చెప్పాడు. 'నిజాయితీగా చెప్పాలంటే ముందుగా బౌలింగ్ చేయడం చాలా కష్టం. స్వింగ్ బౌలింగ్‌తో వికెట్లు తీయాల్సింది. కానీ ఆరంభంలో మేం సరిగ్గా బౌలింగ్ చేయలేదు.

NZ Vs PAK: Shaheen Shah Afridi Reveals The Reason Why Pakistan’s Loss In 2nd T20I vs New Zealand

పవర్ ప్లేలోనే వికెట్లు తీసి న్యూజిలాండ్‌ను 170 పరుగులకు కట్టడి చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. పవర్ ప్లే అనంతరం బంతితో మేం సత్తా చాటాం. హ్యారీస్ రౌఫ్, అబ్బాస్, ఉసామా మిర్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. బ్యాటింగ్‌లో మేం ఆశించిన ఆరంభం దక్కలేదు. పవర్ ప్లే అనంతరం న్యూజిలాండ్ బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేసి వరుసగా వికెట్లు తీసారు.'అని షాహిన్ షా అఫ్రిది చెప్పుకొచ్చాడు.

టాపార్డర్ బ్యాటర్లు చెలరేగడంతో ఈ మ్యాచ్‌లో విజయాన్ని అందుకున్నామని న్యూజిలాండ్ తాత్కలిక కెప్టెన్ టీమ్ సౌథీ తెలిపాడు. 'మా బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. పాకిస్థాన్ బౌలర్లు పుంజుకున్నా.. భారీ లక్ష్యాన్ని అందించారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో పిచ్ ఒకేలా వ్యవహరించింది. మ్యాచ్ సాగుతున్నా కొద్దీ బౌలర్లకు సహకరించింది.

దాంతో వికెట్లు పడ్డాయి. మా టాపార్డర్ బ్యాటర్లు పర్వాలేదనిపించారు. 2 వికెట్లు తీసిన ఇష్ సోదీని తప్పుబట్టాల్సిన పనిలేదు. అతను అద్భుతమైన క్యాచ్‌లను కూడా అందుకున్నాడు.'అని టీమ్ సౌథీ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 194 పరుగులు చేసింది. ఫిన్ అలెన్(67 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 74) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. కేన్ విలియమ్సన్(26), మిచెల్ సాంట్నర్(25) మెరుపులు మెరిపించారు. పాకిస్థాన్ బౌలర్లలో హ్యారీస్ రౌఫ్(3/38) మూడు వికెట్లు తీయగా.. అబ్బాస్ అఫ్రిది(2/43) రెండు వికెట్లు పడగొట్టాడు. ఆమెర్ జమాల్(1/42), ఉసమా మీర్(1/39)తలో వికెట్ తీసారు.

అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 19.3 ఓవర్లలో 173 పరుగులకే కుప్పకూలింది. బాబర్ ఆజామ్(43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66), ఫకార్ జమాన్(25 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. ఆడమ్ మిల్నే(4/33) నాలుగు వికెట్లు తీయగా.. టీమ్ సౌథీ(2/31), బెన్ సీర్స్(2/28), ఇష్ సోధీ(2/33) రెండేసి వికెట్లు తీసారు.

Story first published: Sunday, January 14, 2024, 16:32 [IST]
Other articles published on Jan 14, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+