Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

NZ vs PAK టీ20 సిరీస్.. బాబర్ ఆజామ్, రిజ్వాన్‌పై వేటు!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పేలవ ప్రదర్శనతో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టిన ఆతిథ్య పాకిస్థాన్..సీనియర్ ఆటగాళ్లపై వేటు వేసింది. న్యూజిలాండ్‌ వేదికగా జరిగే ఐదు టీ20ల సిరీస్ నుంచి బాబర్ ఆజామ్, మహమ్మద్ రిజ్వాన్‌లను తప్పించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ ఇద్దరూ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. దాంతో పాకిస్థాన్ ఒక్క విజయం కూడా నమోదు చేయకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన అనంతరం పాకిస్థాన్ జట్టు మార్చి 16 నుంచి న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో న్యూజిలాండ్‌తో ఐదు టీ20లతో పాటు మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌ల్లో ఆడే పాకిస్థాన్ జట్లను ఆ దేశ క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. టీ20 ఫార్మాట్‌ నుంచి బాబర్ ఆజామ్, మహమ్మద్ రిజ్వాన్‌లను తప్పించి కుర్రాళ్లకు అవకాశం కల్పించింది. సల్మాన్ అఘాకు పాకిస్థాన్ టీ20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పింది. షాదాబ్ ఖాన్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది.

NZ vs PAK Babar Azam Mohammad Rizwan dropped from Pakistan T20I squad

న్యూజిలాండ్ -పాకిస్థాన్ మధ్య మార్చి 16 నుంచి టీ20 సిరీస్, మార్చి 29 నుంచి వన్డే సిరీస్‌ ఆడనుంది. ఈ ఏడాది టీ20 ఆసియా కప్‌, వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనుండటంతో జట్టు నిర్మాణంపై పాకిస్థాన్ ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టింది. పొట్టి ఫార్మాట్‌లో కుర్రాళ్లతో జట్టును తయారు చేయాలనుకుంటుంది. ఈ క్రమంలోనే బాబర్ ఆజామ్, మహహ్మద్ రిజ్వాన్‌లపై వేటు వేసింది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు మాత్రం ఈ ఇద్దరిని ఎంపిక చేశారు. షాహిన్ అఫ్రిదికి వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి ఇచ్చారు.

పాకిస్థాన్ టీ20 టీమ్: సల్మాన్ అఘా(కెప్టెన్), షాదాబ్ ఖాన్(వైస్ కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, హరీస్ రౌఫ్, హసన్ నవాజ్, జహందాద్ ఖాన్, ఖుష్‌దిల్ షా, మహమ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహమ్మద్ అలీ, మహ్మద్ హారిస్, మహ్మద్ ఇర్పాన్ ఖాన్, ఒమైర్ బిన్ యూసఫ్, షహీన్ షా అఫ్రిది, సుఫ్యాన్ మొకిమ్, ఉస్మాన్ ఖాన్.

పాక్ వన్డే టీమ్: మహమ్మద్ రిజ్వాన్(కెప్టెన్), సల్మాన్ అలీ అఘా(వైస్ కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, అకీఫ్ జావేద్, బాబర్ ఆజామ్, ఫహీమ్ అష్రఫ్, ఇమామ్ ఉల్ హక్, ఖుష్‌దిల్ షా, మహ్మద్ అలీ, మహ్మద్ వసీం జూనియర్, మహ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, సుఫ్యాన్ మోకిమ్, తయ్యబ్ తాహిర్.

Story first published: Tuesday, March 4, 2025, 19:45 [IST]
Other articles published on Mar 4, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+