Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

NZ vs ENG: చెలరేగుతున్న సన్‌రైజర్స్ బ్యాటర్.. వినోద్ కాంబ్లి రికార్డు బద్దలు!

NZ vs ENG: SRH Fans are Happy with Harry Brook Completes 4th Test Century On Day 1 Of 2nd Test

వెల్లింగ్టన్: న్యూజిలాండ్ పర్యటనలో ఇంగ్లండ్ జోరు కొనసాగుతోంది. రెండు టెస్ట్‌ల సిరీస్‌లోఇప్పటికే తొలి మ్యాచ్‌ను 267 పరుగుల భారీ తేడాతో గెలిచిన ఇంగ్లండ్.. రెండో టెస్ట్‌ను కూడా ఘనంగా ఆరంభించింది. శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్లు హరీ బ్రూక్(169 బంతుల్లో 24 ఫోర్లు, 5 సిక్స్‌లతో 184 బ్యాటింగ్), జోరూట్(182 బంతుల్లో 7 ఫోర్లతో 101 బ్యాటింగ్) సెంచరీలు సాధించారు. హరీ బ్రూక్ వన్డే తరహా బ్యాటింగ్‌తో న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

24 ఫోర్లు, 5 సిక్స్‌లు..

169 బంతుల్లో 24 ఫోర్లు, 5 సిక్సర్లతో 184 పరుగులతో అజేయంగా నిలిచి డబుల్ సెంచరీకి 16 పరుగుల దూరంలో నిలిచాడు. 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును మాజీ కెప్టెన్ జోరూట్‌తో కలిసి ఆదుకున్నాడు. 65 ఓవర్ల ఆట పూర్తవ్వగానే వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపేసారు. ఆట ఆగిపోయే సమయానికి ఇంగ్లండ్ 3 వికెట్లకు 315 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌథీ ఓ వికెట్ తీయగా.. మ్యాట్ హెన్రీ రెండు వికెట్లు పడగొట్టాడు.

వినోద్ కాంబ్లీ రికార్డు బ్రేక్..

సూపర్ బ్యాటింగ్‌తో డబుల్ సెంచరీకి చేరువైన హరీ బ్రూక్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టెస్ట్‌ల్లో తొలి 9 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ రికార్డును అధిగమించాడు. తొలి 9 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో హరీ బ్రూక్ 807 పరుగులతో అగ్రస్థానంలో నిలవగా.. వినోద్ కాంబ్లీ(798), హెర్బెర్ట్(780), సునీల్ గవాస్కర్(778), ఎవర్టన్ వీక్స్(777) తర్వాతి స్థానాల్లో నిలిచారు. గత 9 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలు బాదిన హరీ బ్రూక్ 100.88 యావరేజ్‌తో పరుగులు సాధించాడు.

సంతోషంలో సన్‌రైజర్స్..

హరీ బ్రూక్ సూపర్ బ్యాటింగ్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హరీ బ్రూక్ సెంచరీ చేసిన క్షణాన్ని షేర్ చేస్తూ అభిమానులకు సన్‌రైజర్స్ గుడ్ మార్నింగ్ చెప్పింది. హరీ బ్రూక్ సూపర్ బ్యాటింగ్ ఇంగ్లండ్‌ను గట్టెక్కించాడని పేర్కొంది. ఇక అభిమానులు హరీ బ్రూక్ సూపర్ ఫామ్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఎయిడెన్ మార్కర‌మ్ సారథ్యంలో హరీ బ్రూక్ ఇదే జోరు కనబరిస్తే.. ఆరెంజ్ ఆర్మీకి తిరుగుండదని, ఇతర ఫ్రాంచైజీలకు దబిడి దిబిడేనని కామెంట్ చేస్తున్నారు.

రూ.13.25 కోట్ల భారీ ధరకు..

రూ.13.25 కోట్ల భారీ ధరకు..

ఐపీఎల్ 2023 మినీ వేలంలో హరీ బ్రూక్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.13.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో హరీబ్రూక్‌కు ఇంత ధర పెట్టడాన్ని అభిమానులు తప్పుబట్టారు. కావ్య మారన్‌కు మైండ్ దొబ్బిందని విమర్శించారు.

కానీ అంతర్జాతీయ క్రికెట్‌లో అతను సత్తా చాటుతుండటంతో సరైన నిర్ణయమేనని కొనియాడుతున్నారు. గురువారమే తమ కొత్త కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ అనే విషయాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ వెల్లడించిన విషయం తెలిసిందే.

Story first published: Friday, February 24, 2023, 10:26 [IST]
Other articles published on Feb 24, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+