NZ vs ENG: బెడిసికొట్టిన బజ్‌బాల్ కాన్సెప్ట్.. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే రెండో జట్టుగా న్యూజిలాండ్!

వెల్లింగ్టన్: ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్ సంచలన విజయాన్నందుకుంది. అనేక మలుపులు తిరిగిన ఈ మ్యాచ్ చివరకు ఆతిథ్య జట్టునే వరించింది. 258 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 256 పరుగులకే కుప్పకూలి ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. దాంతో రెండు టెస్ట్‌ల సిరీస్ 1-1తో సమమమైంది. 48/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో చివరి రోజు ఆట ఆసాంతం ఉత్కంఠగా సాగింది.
న్యూజిలాండ్ బౌలర్లు చెలరేగడంతో 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఇంగ్లండ్.. జోరూట్(113 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 95), బెన్ స్టోక్స్(116 బంతుల్లో 6 ఫోర్లతో 33) రాణించడంతో ఓ దశలో 201/5తో పటిష్టంగా కనిపించింది. కానీ వాగ్నర్ వరుస ఓవర్లలో ఈ ఇద్దర్నీ ఔట్ చేయడంతో న్యూజిలాండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. బెన్ ఫోక్స్(35) పోరాడినా ఫలితం లేకపోయింది. ఇంగ్లండ్ విజయానికి రెండు పరుగులు కావాల్సిన సమయంలో అండర్సన్‌ను వాగ్నర్ ఔట్ చేసి కివీస్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
22 ఏళ్ల తర్వాత..
బంతి, బంతికి మారిన ఆధిపత్యం అభిమానులకు కావాల్సిన అసలు సిసలు టెస్ట్ మజాను అందించింది. ధాటిగా ఆడాలనే బేజ్‌బాల్ కాన్సెప్ట్ ఇంగ్లండ్‌ను ముంచింది. ఈ విజయంతో న్యూజిలాండ్ 22 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. ఫాలో ఆన్ ఆడి గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది. 2001లో ఆస్ట్రేలియాతో కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఫాలో ఆల్ ఆడి గెలిచింది. మళ్లీ ఇన్నాళ్లకు న్యూజిలాండ్ ఈ తరహా విజయాన్నందుకుంది. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన నాలుగో టీమ్‌గా న్యూజిలాండ్ చరిత్రకెక్కింది.
146 టెస్ట్ చరిత్రలోనే రెండో జట్టుగా..
1894లో ఆస్ట్రేలియా ఇంగ్లండ్ ఫాలో ఆన్ ఆడి విజయం సాధించగా.. 1981లో మరోసారి ఇంగ్లండే ఆసీస్‌ను ఓడించింది. ఇక 2001లో భారత్.. ఆసీస్‌ను ఓడించగా.. తాజాగా ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ గెలుపొందింది. 146 ఏళ్ల టెస్ట్ చరిత్రలో ఒక్కపరుగుతో గెలిచిన రెండో జట్టుగా న్యూజిలాండ్ రికార్డుకెక్కింది. అంతకుముందు 1993లో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ ఒక్క పరుగుతో గెలుపొందింది.

ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసినా..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 435/8 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. హరీ బ్రూక్(176 బంతుల్లో 24 ఫోర్లు, 5 సిక్స్‌లతో 186), జోరూట్(224 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 153 నాటౌట్) సెంచరీలతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ(4/100) నాలుగు వికెట్లు తీయగా.. మైఖేల్ బ్రేస్‌వెల్(2/54) రెండు వికెట్లు పడగొట్టాడు. టీమ్ సౌథీ, నీల్ వాగ్నర్ తలో వికెట్ తీసారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 209 పరుగులకు కుప్పకూలింది.

ఆదుకున్న కేన్ మామ..
226 పరుగుల లోటుతో ఫాలోఆన్ ఆడిన న్యూజిలాండ్‌ను కేన్ విలియమ్సన్(282 బంతుల్లో 12 ఫోర్లతో 132) సూపర్ సెంచరీతో ఆదుకున్నాడు. దాంతో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 483 పరుగుల భారీ స్కోర్ చేసింది. కేన్ విలియమ్సన్‌కు తోడుగా టామ్ బ్లండెల్(166 బంతుల్లో 9 ఫోర్లతో 90), డారిల్ మిచెల్(54 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 54) హాఫ్ సెంచరీలతో రాణించారు. దాంతో ఇంగ్లండ్ ముందు 258 పరుగుల లక్ష్యం నమోదైంది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 256 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. న్యూజిలాండ్ బౌలర్లలో నీల్ వాగ్నర్ నాలుగు వికెట్లు తీయగా.. టీమ్ సౌథీ మూడు, మ్యాట్ హెన్రీ రెండు వికెట్లు పడగొట్టారు. ఫాలో ఆన్ ఆడించడంతో పాటు బజ్‌బాల్ కాన్సెప్ట్‌తో ఆడటం ఇంగ్లండ్ కొంపముంచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications