For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

NZ vs ENG: పాపం కేన్ మామ.. విచిత్రకర రీతిలో ఔట్!(వీడియో)

న్యూజిలాండ్ వెటరన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ విచిత్రకర రీతిలో ఔటయ్యాడు. బంతిని స్టంప్స్‌పైకి తన్ని దురదృష్టకర రీతిలో. న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. శనివారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది.

ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కేన్ విలియమ్సన్ ఆచితూచి ఆడి హాఫ్ సెంచరీ దిశగా సాగాడు. కానీ ఇంగ్లండ్ పేసర్ మాథ్యూ పోట్స్ బౌలింగ్‌లో దురదృష్టకర రీతిలో ఔటయ్యాడు.

NZ vs ENG Kane Williamson kicks ball onto stumps in bizarre dismissal in 3rd Test Video

మాథ్యూ పోట్స్ వేసిన 59వ ఓవర్ చివరి బంతికి కేన్ విలియమ్సన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇన్ స్వింగర్‌గా వేసిన ఈ బంతిని కేన్ మామ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు. బ్యాట్‌ను తాకిన బంతి పిచ్ అయ్యి బౌన్స్ అవ్వగా.. కేన్ మామ కాలితో అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ అదే కాలుతో బంతిని వికెట్లపై కి నెట్టాడు. దాంతో స్టంప్స్ కిందపడగా.. ఓ అంటూ తీవ్ర అసహనానికి గురయ్యాడు. ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

పాపం కేన్ మామ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 82 ఓవర్లలో 9 వికెట్లకు 315 పరుగులు చేసింది. కెప్టెన్ టామ్ లాథమ్(135 బంతుల్లో 9 ఫోర్లతో 63), మిచెల్ సాంట్నర్(54 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా.. విల్ యంగ్(92 బంతుల్లో 10 ఫోర్లతో 42), కేన్ విలియమ్సన్(87 బంతుల్లో 9 ఫోర్లతో 44), కీలక ఇన్నింగ్స్ ఆడారు.

ఇంగ్లండ్ బౌలర్లలో మాథ్యూ పోట్స్, గస్ అట్కిన్సన్ మూడేసి వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్ రెండు వికెట్లు పడగొట్టాడు. బెన్ స్టోక్స్‌కు ఓ వికెట్ దక్కింది.

కెరీర్‌లో ఆఖరి మ్యాచ్‌ ఆడుతున్న టీమ్ సౌథీ(10 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 23) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మిచెల్ సాంట్నర్(50 బ్యాటింగ్)కు అండగా క్రీజులో నిలబడ్డాడు. మూడు భారీ సిక్స్‌లు కొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. టీమ్ సౌథీ ఇంగ్లండ్ ఆటగాళ్లంతా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు.

Story first published: Saturday, December 14, 2024, 12:25 [IST]
Other articles published on Dec 14, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+