Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

NZ vs ENG:సెంచరీతో కేన్ మామ అరుదైన రికార్డు.. తొలి కివీస్ ప్లేయర్‌గా..!

NZ vs ENG: Kane Williamson becomes New Zealands highest Test run-scorer; he breaks Ross Taylors record

వెల్లింగ్టన్: న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టెస్ట్ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన న్యూజిలాండ్ బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో కేన్ మామ ఈ ఫీట్ సాధించాడు. ఈ క్రమంలో కివీస్ మాజీ బ్యాటర్ రాస్ టేలర్‌ రికార్డును అధిగమించాడు. ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్ నాలుగో రోజు ఆటలో అండర్సన్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ దిశగా బౌండరీ బాదిన కేన్ విలియమ్సన్.. 7,684 పరుగుల ఘనతను అందుకున్నాడు.

రాస్ టేలర్ రికార్డు బద్దలు..

గతేడాదే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రాస్ టేలర్ 112 టెస్ట్‌ల్లో 7, 683 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 3 డబుల్ సెంచరీలు ఉండగా.. 35 హాఫ్ సెంచరీలున్నాయి. తాజాగా ఈ ఘనతను కేన్ మామ అధిగమించాడు. ఈ సందర్భంగా రాస్ టేలర్.. కేన్ విలియమ్సన్‌ను అభినందిస్తూ ట్వీట్ చేశాడు.

ఇది టెస్ట్ క్రికెట్ పట్ల కేన్ విలియమ్సన్‌కు ఉన్న నిబద్దత, అంకితభావానికి నిదర్శనమని పేర్కొన్నాడు. ఇలాంటి ఘనతను మరిన్నీ అందుకోవాలని ఆకాంక్షించాడు.

161 ఇన్నింగ్స్‌ల్లో..

ఇక కేన్ విలియమ్సన్‌ 92 టెస్ట్‌ల్లు 161 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనతను అందుకోవడం విశేషం. టేలర్ 112 టెస్ట్‌లు 196 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు. ఈ ఇద్దరి తర్వాత న్యూజిలాండ్ తరఫున అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన జాబితాలో స్టీఫెన్ ఫ్లేమింగ్(7172), బ్రెండన్ మెక్‌కల్లమ్(6453), మార్నిన్ క్రోవ్(5444) ఉన్నారు.

ఈ మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ 282 బంతుల్లో 12 ఫోర్లతో 132) సూపర్ సెంచరీతో న్యూజిలాండ్‌ను ఆదుకున్నాడు. 202/3 ఓవర్ నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన కివీస్.. కేన్ మామ సెంచరీతో రెండో ఇన్నింగ్స్‌లో 483 పరుగుల భారీ స్కోర్ చేసింది.

సూపర్ సెంచరీతో..

సూపర్ సెంచరీతో..

కేన్ విలియమ్సన్‌కు తోడుగా టామ్ బ్లండెల్(166 బంతుల్లో 9 ఫోర్లతో 90), డారిల్ మిచెల్(54 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 54) హాఫ్ సెంచరీలతో రాణించారు. దాంతో ఇంగ్లండ్ ముందు 258 పరుగుల లక్ష్యం నమోదైంది. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్(5/157) ఐదు వికెట్లు తీయగా.. ఓలీ రాబిన్సన్, జేమ్స్ అండర్సన్, జోరూట్, హరీ బ్రూక్‌లకు తలో వికెట్ దక్కింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 48 పరుగులే చేసింది.

క్రీజులో బెన్ డకెట్(23 బ్యాటింగ్), ఓలి రాబిన్సన్(1 బ్యాటింగ్) ఉండగా.. జాకీ క్రాలీ(24) నిరాశపరిచాడు. సౌథీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

Story first published: Monday, February 27, 2023, 15:32 [IST]
Other articles published on Feb 27, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+