
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ పట్టు బిగించింది. సమష్టిగా రాణించి విజయం దిశగా దూసుకెళ్తోంది. బ్యాటింగ్‌లో హరీ బ్రూక్(176 బంతుల్లో 24 ఫోర్లు, 5 సిక్స్‌లతో 186), జోరూట్(224 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 153 నాటౌట్) భారీ సెంచరీలతో సత్తా చాటితే... బౌలింగ్‌లో జేమ్స్ అండర్సన్(3/37), జాక్ లీచ్(3/45) అదరగొట్టారు. దాంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 42 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులు చేసింది. టామ్ లాథమ్(35), హెన్రీ నికోల్స్(30) మినహా అంతా విఫలమయ్యారు. క్రీజులో టామ్ బ్లండెల్(25 బ్యాటింగ్), టీమ్ సౌథీ(23 బ్యాటింగ్) ఉన్నారు.
అంతకుముందు 315/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ 435/8 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. ఓవర్‌నైట్ బ్యాటర్ హరీ బ్రూక్ రెండు పరుగులు మాత్రమే చేసి ఔటవ్వగా.. జోరూట్ జట్టును ముందుకు నడపించాడు. అతనికి కెప్టెన్ బెన్ స్టోక్స్ అండగా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ(4/100) నాలుగు వికెట్లు తీయగా.. మైఖేల్ బ్రేస్‌వెల్(2/54) రెండు వికెట్లు పడగొట్టాడు. టీమ్ సౌథీ, నీల్ వాగ్నర్ తలో వికెట్ తీసారు. ప్రస్తుతం న్యూజిలాండ్ 297 పరుగుల వెనుకంజలో ఉంది. అద్భుతం జరిగితే తప్పా ఆ జట్టు ఓటమి నుంచి తప్పించుకోలేదు.
రెండు టెస్ట్‌ల సిరీస్‌లోఇప్పటికే తొలి మ్యాచ్‌ను 267 పరుగుల భారీ తేడాతో గెలిచిన ఇంగ్లండ్ సిరీస్ క్లీన్ స్వీప్‌పై కన్నేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును మాజీ కెప్టెన్ జోరూట్‌తో కలిసి హరీ బ్రూక్ ఆదుకున్నాడు. నాలుగో వికెట్‌కు ఈ జోడీ 302 పరుగుల భాగస్వామ్యాన్ని అందించింది.
టెస్ట్‌ల్లో తొలి 9 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా హరీ బ్రూక్ వరల్డ్ రికార్డు నమోదు చేశాడు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ రికార్డును అధిగమించాడు. తొలి 9 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో హరీ బ్రూక్ 809 పరుగులతో అగ్రస్థానంలో నిలవగా.. వినోద్ కాంబ్లీ(798), హెర్బెర్ట్(780), సునీల్ గవాస్కర్(778), ఎవర్టన్ వీక్స్(777) తర్వాతి స్థానాల్లో నిలిచారు. గత 9 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలు బాదిన హరీ బ్రూక్ 100.88 యావరేజ్‌తో పరుగులు సాధించాడు.