కేన్ మామ సెంచరీ..
కేన్ విలియమ్సన్‌కు తోడుగా టామ్ బ్లండెల్(166 బంతుల్లో 9 ఫోర్లతో 90), డారిల్ మిచెల్(54 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 54) హాఫ్ సెంచరీలతో రాణించారు. దాంతో ఇంగ్లండ్ ముందు 258 పరుగుల లక్ష్యం నమోదైంది. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్(5/157) ఐదు వికెట్లు తీయగా.. ఓలీ రాబిన్సన్, జేమ్స్ అండర్సన్, జోరూట్, హరీ బ్రూక్‌లకు తలో వికెట్ దక్కింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 48 పరుగులే చేసింది. క్రీజులో బెన్ డకెట్(23 బ్యాటింగ్), ఓలి రాబిన్సన్(1 బ్యాటింగ్) ఉండగా.. జాకీ క్రాలీ(24) నిరాశపరిచాడు. సౌథీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
తొలి సెషన్ ఆటతో..
ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే ఇంగ్లండ్ 210 పరుగులు చేయాలి. వికెట్‌పై పగుళ్లు ఏర్పడటంతో స్పిన్నర్లకు అనుకూలంగా మారింది. జాక్ లీచ్ ఐదు వికెట్లు తీయడమే దీనికి నిదర్శనం. మరీ న్యూజిలాండ్ బౌలర్లను ఇంగ్లండ్ ఎలా ఎదుర్కొంటుందనేదే ఆసక్తికరం. ఐదో రోజు తొలి సెషన్ ఆట ఫలితాన్ని నిర్ణయించనుంది. వర్షం వస్తే మాత్రం డ్రాగా ముగియనుంది. తొలి ఇన్నింగ్స్ మాదిరి బ్యాటింగ్ చేస్తే ఇంగ్లండ్ సునాయస విజయాన్నందుకుంటుంది.
జోరూట్, హరీ బ్రూక్ సెంచరీ...
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 435/8 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. హరీ బ్రూక్(176 బంతుల్లో 24 ఫోర్లు, 5 సిక్స్‌లతో 186), జోరూట్(224 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 153 నాటౌట్) సెంచరీలతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ(4/100) నాలుగు వికెట్లు తీయగా.. మైఖేల్ బ్రేస్‌వెల్(2/54) రెండు వికెట్లు పడగొట్టాడు. టీమ్ సౌథీ, నీల్ వాగ్నర్ తలో వికెట్ తీసారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 209 పరుగులకు కుప్పకూలింది.
ఓపెనర్ల శుభారంభంతో..
కెప్టెన్ టీమ్ సౌథీ(49 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 73) ఒక్కడే రాణించగా... ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్ నాలుగు వికెట్లు, జేమ్స్ అండర్సన్, జాక్ లీచ్ మూడేసి వికెట్లు పడగొట్టారు. భారీ ఆధిక్యం లభించడంతో ఇంగ్లండ్.. న్యూజిలాండ్‌ను ఫాలో ఆన్ ఆడించింది. ఓపెనర్లు టామ్ లాథమ్(172 బంతుల్లో 11 ఫోర్లతో 83), డేవాన్ కాన్వే(155 బంతుల్లో 6 ఫోర్లతో 61) హాఫ్ సెంచరీలతో తొలి వికెట్‌కు 149 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఈ ఆరంభాన్ని కేన్ విలియమ్సన్ భారీ స్కోర్‌గా మలిచి జట్టు పరువును కాపాడాడు.


Click it and Unblock the Notifications












