
22 వరుస విజయాలు
న్యూజిలాండ్ మహిళలతో జరిగిన వన్డేలో ఆసీస్ మహిళలు 6 వికెట్ల తేడాతో విజయం సాధించారు. ఫలితంగా అత్యధికంగా 22 వరుస విజయాలు సాధించిన జట్టుగా కొత్త చరిత్రను నెలకొల్పారు. ఈ క్రమంలోనే 2003 సీజన్‌లో ఆస్ట్రేలియా పురుషుల జట్టు సాధించిన వరుస వన్డే విజయాల రికార్డును అదే దేశానికి మహిళలు జట్టు బ్రేక్ చేసింది. రికీ పాంటింగ్ సారథ్యంలోని ఆసీస్ జట్టు వరుసగా 21 వన్డే విజయాలు సాధించగా.. అది ఇప్పటివరకూ వరల్డ్ రికార్డుగా ఉంది. దాన్ని ఆదివారం ఆసీస్ మహిళలు సవరించారు.

అప్పటినుంచి ఓటమి రుచి చూడలేదు
చివరిసారి 2017 అక్టోబర్‌లో ఓ వన్డే మ్యాచ్‌లో ఓడిపోయిన ఆస్ట్రేలియా మహిళల జట్టు.. ఇప్పటి వరకూ మళ్లీ ఓటమి రుచి చూడలేదు. 2018 మార్చి నుంచి ఆసీస్ వరుస విజయాలను సాధించింది. భారత్‌లో ఆ ఏడాది జరిగిన వన్డే సిరీస్‌ను ఆసీస్ మహిళలు 3-0తో కైవసం చేసుకోగా.. ఆపై పాకిస్తాన్‌తో 3-0తో మరొక సిరీస్‌ను దక్కించుకున్నారు. న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక ఇలా వరుసగా మూడు వన్డేల సిరీస్‌లను ఆసీస్ మహిళలు సాధించారు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించారు.

టాప్-5లో మూడుసార్లు
వన్డేల్లో వరుస విజయాలు సాధించిన టాప్-5 లిస్టులో ఆస్ట్రేలియా మహిళల జట్టు మూడుసార్లు ఉండడం విశేషం. 2018-21లో 22 విజయాలు, 1997-99లో 17 విజయాలు, 1999-2000లో 16 విజయాలు సాధించింది. 2003లో ఆస్ట్రేలియా పురుషుల జట్టు 21 వరుస విజయాలు అందుకుంది. 2016-17లో భారత మహిళల జట్టు వరుసగా 16 విజయాలు సాధించింది. భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ లాంటి టాప్ జట్లకు సైతం ఈ రికార్డు సాధ్యం కాలేదు.
న్యూజిలాండ్‌పై ఆసీస్ విజయం
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. లారెన్ డౌన్ (90) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. ఆసీస్ బౌలర్లలో మేగాన్ ష్కట్ నాలుగు వికెట్లు తీయగా.. నికోలా కారే మూడు వికెట్లు ఖాతాలో వేసుకుంది. అనంతరం 213 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ మహిళలు 38.3 ఓవర్లలో విజయం సాధించారు. అలెసా హీలే (65), ఎలీస్ పెర్రీ (56 నాటౌట్), ఆష్లే గార్డెనర్ (53 నాటౌట్)లు రాణించారు.
Rajasthan Royals: కెప్టెన్ అవుతానని అస్సలు ఊహించలేదు: శాంసన్


Click it and Unblock the Notifications
