న్యూజిలాండ్ గడ్డపై ఆస్ట్రేలియా జైత్రయాత్ర కొనసాగుతోంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచింది. శుక్రవారం జరిగిన రెండో టీ20లో సమష్టిగా రాణించిన ఆస్ట్రేలియా 72 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 19.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్(22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 45), మిచెల్ మార్ష్(21 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 26), ప్యాట్ కమిన్స్( 22 బంతుల్లో 5 ఫోర్లతో 28) మెరుపులు మెరిపించారు. న్యూజిలాండ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్(4/41) నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. ఆడమ్ మిల్నే, బెన్ సియర్స్, మిచెల్ సాంట్నర్ తలో రెండు వికెట్లు తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్.. 17 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. గ్లేన్ ఫిలిప్స్(35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42) రాణించారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా(4/34) నాలుగు వికెట్లు తీయగా.. నాథన్ ఎల్లిస్(2/16) రెండు వికెట్లు పడగొట్టారు. జోష్ హజెల్‌వుడ్, ప్యాట్ కమిన్స్, మిచెల్ మార్ష్ తలో వికెట్ తీసారు.
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్యాట్ కమిన్స్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన ఆసీస్.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది.