Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

NZ vs AFG T20 WC: చెలరేగిన బౌల్ట్.. నజీబుల్లా హాఫ్ సెంచరీ! కివీస్ ముందు ఈజీ టార్గెట్!

NZ vs AFG T20 WC: New Zealand need 125 to knock Afghanistan, India out

అబుదాబి: టీ20 ప్రపంచకప్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. న్యూజిలాండ్ బౌలర్లు సమష్టిగా చెలరేగడంతో ప్రత్యర్థి ముందు 125 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచారు. అఫ్గాన్ టాపార్డర్, లోయరార్డర్ విఫలమైన వేళ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ నజీబుల్లా జడ్రాన్(48 బంతుల్ల 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 73) ఒంటరి పోరాటంతో జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ అందించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 124 పరుగులు చేసింది. నజీబుల్లా మినహా అంతా విఫలమయ్యారు.

న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌథీ(2/24), ట్రెంట్ బౌల్ట్(3/17) అఫ్గాన్ పతనాన్ని శాసించగా.. ఆడమ్ మిల్నే, జేమ్స్ నీషమ్, ఇష్ సోదీ తలో వికెట్ తీశారు.ఇన్నింగ్స్ ప్రారంభంలోనే అఫ్గానిస్థాన్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. మిల్నే, ట్రెంట్ బౌల్ట్ తమ వరుస ఓవర్లలో ఓపెనర్లు మహమ్మద్ షెహ్‌జాద్(4), హజ్రతుల్లా జాజై‌లను ఔట్ చేశారు. ఆ కొద్ది సేపటికే క్రీజులోకి వచ్చిన రెహ్మానుల్లా గుర్బాజ్(6)ను కూడా సౌతీ పెవిలియన్ చేర్చడంతో పవర్ ప్లేలో అఫ్గాన్ మూడు వికెట్ల నష్టానికి 23 పరుగులు మాత్రమే చేసింది. దాంతో క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మన్ రక్షణాత్మకంగా ఆడే ప్రయత్నం చేశారు. గుల్బాదిన్ నైబ్(15), నజీబుల్లా జడ్రాన్(73) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

అయితే ఈ జోడీని ఇష్ సోదీ విడదీశాడు. గుల్బాదిన్ నైబ్‌ను క్లీన్ బౌల్డ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కెప్టెన్ మహమ్మద్ నబీ(14)తో కలిసి జడ్రాన్ ధాటిగా ఆడాడు. భారీ షాట్లతో విరుచుకుపడటంతో స్కోరు బోర్డు పరుగెత్తింది. ధాటిగా ఆడే క్రమంలో మహమ్మద్ నబీ, జడ్రాన్ ఔటవ్వడం.. మరోవైపు సిక్సర్లను సైతం న్యూజిలాండ్ ఫీల్డర్స్ అడ్డుకోవడంతో అఫ్గాన్ స్వల్ప స్కోర్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. రషీద్ ఖాన్ భారీ షాట్లు ఆడే ప్రయత్నం చేసినా.. విలియమ్సన్ సూపర్ క్యాచ్‌కు వెనుదిరగాల్సి వచ్చింది.

Story first published: Sunday, November 7, 2021, 17:37 [IST]
Other articles published on Nov 7, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+