Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

NZ vs AFG T20 WC: న్యూజిలాండ్ గెలుస్తుందని గంభీర్ చెప్పేసాడుగా.. ఇక మనకు నో టెన్షన్! పేలుతున్న సెటైర్లు!

NZ vs AFG T20 WC: Gautam Gambhir brutally trolled after he predicts New Zealand win against Afghanistan

హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ సోషల్ మీడియా వేదికగా మరోసారి తీవ్ర ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ను ఉద్దేశించి ఈ బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేల్చుతున్నారు. ఫన్నీ మీమ్స్, కామెంట్స్‌తో రోస్ట్ చేస్తున్నారు. దాంతో గంభీర్ పేరు ట్విటర్ వేదికగా మారమోగుతోంది. అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ప్రీ మ్యాచ్ షోలో మాట్లాడిన గంభీర్.. అఫ్గాన్‌పై న్యూజిలాండ్ సునాయస విజయాన్నందుకుంటుందని అంచనా వేశాడు. దాంతో అభిమానులు అతన్ని ఆడుకుంటున్నారు.

గంభీర్ అంచనాలన్నీ..

అయితే సాధారణంగా గౌతం గంభీర్ చెప్పే అంచనాలన్నీ తలకిందులవుతాయి. అతను గెలుస్తదని చెప్పిన టీమ్ ఓడిపోవడం ఎక్కువసార్లు జరిగింది. ఐపీఎల్ నుంచి తాజా టీ20 ప్రపంచకప్ వరకు అతని అంచనాలన్నీ తప్పిదంగా నిరూపితమయ్యాయి. పాకిస్థాన్‌తో భారత్ విజయం సాధిస్తుందని, న్యూజిలాండ్‌ను చిత్తు చేస్తుందని గంభీర్ అంచనా వేయగా.. ఈ రెండు మ్యాచ్‌ల్లో కోహ్లీసేన చిత్తుగా ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

దాంతో గంభీర్ అంచనాలను అభిమానులు పెద్దగా విశ్వసంచరు. ఈ క్రమంలోనే అతను అఫ్గాన్‌పై న్యూజిలాండ్ గెలుస్తుందని చెప్పగానే వారంతా అతనిపై సెటైర్లు పేల్చుతున్నారు.

న్యూజిలాండ్ అస్సామే..

న్యూజిలాండ్ గెలుస్తుందని గంభీర్ చెప్పాడంటే.. ఆ జట్టు ఓటమి ఖాయమంటున్నారు. అతని ట్వీట్, కామెంట్స్‌తో యావత్ దేశం పులికించిపోతుందని కామెంట్ చేస్తున్నారు. న్యూజిలాండ్ విజయాన్ని గంభీర్ అంచనా వేసాడంటే భారత్‌కు అవకాశాలున్నట్లేనని మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. గౌతం గంభీర్ ప్రిడిక్షన్‌తో పాటు కుమార ధర్మసేన అంపైర్‌గా చేస్తున్నాడని, ముజీ ఉర్ రెహ్మాన్ ఆడుతున్నాడు కాబట్టి అఫ్గాన్ విజయం సాధిస్తుందని భారత అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

అబ్బా ప్లీజ్..

గంభీర్‌ను ట్రోల్ చేయడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా అఫ్గాన్ విజయాన్ని కోరుతూ ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. 'భారత్ మీ అభివృద్ది కోసం రూ. వందల కోట్లు ఖర్చు చేసింది. మీ దేశంలో జల విద్యుత్ కేంద్రాలు, పార్లమెంట్ నిర్మించాం. మీకు క్రికెట్ నేర్పించాం. కృతజ్ఞతగా ఈ ఒక్కసారి గెలవండి ప్లీజ్. మీరు గెలిస్తే తాజ్ మహాల్ రాసిస్తాం. తిరుపతి వెళ్లి గుండు కొట్టించుకుంటాం.'అని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ ఫలితం కోసం అభిమానులంతా ఎదురు చూస్తున్నారు.

అఫ్గాన్ గెలిస్తే..

మామూలుగానైతే ఈ మ్యాచ్‌‌ను ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ.. ఈ మ్యాచ్ ఫలితంపైనే భారత జట్టు భవితవ్యం ఆధారపడి ఉండటంతో కోట్లాది భారత అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్‌ గెలిస్తేనే భారత జట్టుకు సెమీస్‌ అవకాశం ఉంటుంది. అప్పుడు అఫ్గాన్‌, కివీస్‌, భారత్‌ (నమీబియాతో విజయంతో)కు సమానంగా ఆరు పాయింట్లుంటాయి.

కానీ అందరికంటే ఎక్కువ నెట్‌రన్‌రేట్‌ కలిగిన కోహ్లీ సేన సెమీస్‌లో అడుగుపెడుతుంది. అందుకే ఎలాగైనా కివీస్‌పై నబీ సేన గెలిచి మన జట్టుకు దారి చూపాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ పటిష్టంగా కనిపిస్తున్న న్యూజిలాండ్‌ ఈ మ్యాచ్‌లో గెలిస్తే చాలు.. ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా నేరుగా సెమీస్‌కు వెళుతుంది. ఇదే జరిగితే భారత్‌ ఆశలు ఆవిరై, నమీబియాతో జరిగే చివరి మ్యాచ్‌ నామమాత్రమవుతుంది.

Story first published: Sunday, November 7, 2021, 16:29 [IST]
Other articles published on Nov 7, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+