NZ vs AFG T20 WC 2021: భారత్ ఆశలన్నీ అఫ్గాన్‌పైనే! ఈ కీలక మ్యాచ్‌లో బరిలోకి దిగే తుది జట్లు ఇవే!

అబుదాబి: టీ20 ప్రపంచకప్ సూపర్ 12, గ్రూప్-2లో భాగంగా నేడు(ఆదివారం) అఫ్ఘానిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగబోతోంది. మామూలుగానైతే ఈ మ్యాచ్‌ను ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ.. ఈ మ్యాచ్ ఫలితంపైనే భారత జట్టు భవితవ్యం ఆధారపడి ఉండటంతో కోట్లాది భారత అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ గెలిస్తేనే భారత జట్టుకు సెమీస్ అవకాశం ఉంటుంది. అప్పుడు అఫ్గాన్, కివీస్, భారత్ (నమీబియాతో విజయంతో)కు సమానంగా ఆరు పాయింట్లుంటాయి. కానీ అందరికంటే ఎక్కువ నెట్‌రన్‌రేట్ కలిగిన కోహ్లీ సేన సెమీస్‌లో అడుగుపెడుతుంది. అందుకే ఎలాగైనా కివీస్‌పై నబీ సేన గెలిచి మన జట్టుకు దారి చూపాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ పటిష్టంగా కనిపిస్తున్న న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లో గెలిస్తే చాలు.. ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా నేరుగా సెమీస్‌కు వెళుతుంది. ఇదే జరిగితే భారత్ ఆశలు ఆవిరై, నమీబియాతో జరిగే చివరి మ్యాచ్ నామమాత్రమవుతుంది.

పటిష్టంగా కివీస్..
ప్రపంచకప్‌లో టీమిండియాకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ వచ్చివుండదేమో! సెమీస్ రేసులో నిలుస్తుందా లేదా అన్నది ఇప్పుడు భారత్ చేతిలో లేదు. ఒకవేళ అఫ్గానిస్థాన్ సంచలనం సృష్టిస్తే భారత్ సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ముందంజ వేయాలంటే చివరి మ్యాచ్‌లో సోమవారం నమీబియాపై భారీ తేడాతో గెలవాల్సివుంటుంది. అది కష్టమేమీ కాదు కానీ.. ఫామ్‌లో ఉన్న కివీస్‌ను ఓడించడమే అఫ్గానిస్థాన్‌కు చాలా కష్టమైన పని. శుక్రవారం నమీబియాపై అలవోకగా నెగ్గిన న్యూజిలాండ్.. ఈ మ్యాచ్‌లో రెట్టించిన విశ్వాసంతో బరిలోకి దిగుతోంది. టాప్ ఆర్డర్ విఫలమయ్యాక జట్టును ఆదుకున్న నీషమ్, ఫిలిప్స్.. నమీబియాకు గట్టి లక్ష్యాన్ని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించారు.

పరుగులు చేస్తేనే..
ఆ లక్ష్యం నమీబియాకు చాలా పెద్దదైపోయింది. టోర్నమెంట్లో నిలకడగా రాణిస్తున్న కివీస్ బౌలర్లతో అఫ్గాన్ బ్యాట్స్‌మెన్‌కు కూడా సమస్యలు తప్పవు. ఒకరకంగా మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించేది వాళ్లే. ఇప్పటిదాకా అఫ్గానిస్థాన్ బ్యాట్స్‌మెన్ ఫర్వాలేదనిపించినా.. బౌల్ట్, సౌథీ, మెల్నేలు పదునైన పేస్‌ను, సోధి, శాంట్నర్‌ల స్పిన్ మాయాజాలాన్ని తట్టుకుని నిలవడం వారికి సవాలే. అఫ్గాన్ బ్యాట్స్‌మెన్ ఓ మాదిరి స్కోరు చేయగలిగితే.. రషీద్ ఖాన్ నేతృత్వంలోని బౌలింగ్ దళం ప్రభావం చూపగలుగుతుంది. అయితే గాయంతో ఇబ్బంది పడుతున్న ముజీబ్ ఈ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. స్పిన్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడే కివీస్‌కు సవాలు మాత్రం తప్పదు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ మధ్య ఓవర్లలో స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరం కానుంది.

పిచ్ రిపోర్ట్:
అబుదాబి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు నమోదైన అత్యధిక స్కోర్లన్నీ ఈ మైదానంలోనే వచ్చాయి. అయితే పవర్ ప్లేలో లోయెస్ట్ స్కోర్స్ కూడా ఈ పిచ్‌పైనే ఉన్నాయి. ఆరంభంలో బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. ఓపికగా ఆడితే పరుగులు రాబట్టవచ్చు. అయితే బౌండరీలు పెద్దగా ఉంటాయి కాబట్టి, బ్యాట్, బాల్ మధ్య ఆసక్తికరపోరు నడుస్తది.

న్యూజిలాండ్:
మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డేవాన్ కాన్వే(కీపర్), గ్లేన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, టీమ్ సౌథీ, ఇష్ సోధీ, ట్రెంట్ బౌల్ట్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications