NZ vs AFG: చెలరేగిన లాథమ్, ఫిలిప్స్.. అఫ్గాన్ ముందు టఫ్ టార్గెట్!
చెన్నై: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ 289 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. కెప్టెన్ టామ్ లాథమ్(74 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68), గ్లేన్ ఫిలిప్స్(80 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 71), విల్ యంగ్( 64 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.
దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 288 పరుగులు చేసింది. అఫ్గాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఓమర్జాయి, నవీన్ ఉల్ హక్ రెండేసి వికెట్లు తీయగా.. ముజీబ్ ఉర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీసారు. అఫ్గానిస్థాన్ చెత్త ఫీల్డింగ్ న్యూజిలాండ్ బ్యాటర్లకు కలిసొచ్చింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను ఓడించి జోరు మీదున్న అఫ్గానిస్థాన్.. ఈ మ్యాచ్‌లో ఆ జోరు కొనసాగించలేకపోయింది.

అచ్చొచ్చిన స్పిన్ వికెట్‌పై బౌలింగ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కనీసం బ్యాటింగ్‌లోనైనా సత్తా చాటి మరో సంచలన విజయం నమోదు చేస్తుందో లేదో చూడాలి. భీకర పేస్ అటాక్‌తో పాటు అనుభవం కలిగిన స్పిన్నర్లు ఉన్న న్యూజిలాండ్‌ను ఎదుర్కొవడం అఫ్గాన్ బ్యాటర్లకు అంత సులువైన పని కాదు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు అఫ్గానిస్థాన్ చెత్త ఫీల్డింగ్ కలిసొచ్చింది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ఆరు క్యాచ్‌లను అఫ్గాన్ ఫీల్డర్లు నేలపాలు చేశారు. ఇందులో నాలుగు సునాయస క్యాచ్‌లు ఉండగా.. రెండు కష్టతరమైనవి. పరుగులను ఆపడంలోనూ విఫలమైన అఫ్గాన్ ఫీల్డర్లు.. ఓ రనౌట్‌తో పాటు స్టంపౌట్ అవకాశాన్ని కూడా చేజార్చారు. ఈ అవకాశాలతో చెలరేగిన కివీస్ బ్యాటర్లు భారీ లక్ష్యాన్ని నమోదు చేశారు.
ఈ ఆరు క్యాచ్‌ల్లో మూడు పట్టినా.. న్యూజిలాండ్ స్వల్ప స్కోర్‌కే పరిమితమయ్యేది. అప్పుడు మరో సంచలన ఫలితానికి అవకాశం ఉండేది. ఫజలక్ ఫరూకీ వేసిన రెండో ఓవర్ నాలుగో బంతికి విల్ యంగ్ ఇచ్చిన క్యాచ్‌ను రెహ్మత్ షా ఫస్ట్ స్లిప్‌లో నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో చెలరేగిన అతను హాఫ్ సెంచరీతో జట్టుకు మంచి ఆరంభాన్ని అందించాడు.
ముజీబ్ ఉర్ రెహ్మాన్ వేసిన 9వ ఓవర్ చివరి బంతికి రచిన్ రవీంద్ర ఇచ్చిన క్యాచ్‌ను షార్ట్ మిడ్ వికెట్‌లో షాహిది అందుకోలేకపోయాడు. రషీద్ ఖాన్ వేసిన 20 ఓవర్ రెండో బంతికి రచిన్ రవీంద్ర ఇచ్చిన మరో సునాయ క్యాచ్‌ను కూడా అఫ్గాన్ ఫీల్డర్లు నేలపాలు చేశారు. ఈ అవకాశాలతో 32 పరుగులు చేసిన రచిన్ రవీంద్ర.. రెండో వికెట్‌కు విల్ యంగ్‌తో కలిసి 79 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
రషీద్ ఖాన్ వేసిన 41 ఓవర్ చివరి బంతికి టామ్ లాథమ్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను ముజీబ్ ఉర్ రెహ్మాన్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో చెలరేగిన అతను హాఫ్ సెంచరీతో పాటు జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications